Aadhaar Card: ఆధార్ కార్డు వాడేవారికి కేంద్రం సూపర్ న్యూస్.. ఉచితంగా అప్డేట్ చేయించుకోవచ్చు.. అప్పటివరకే ఛాన్స్..

ఆధార్ కార్డు‌దారులకు కేంద్రం తీపికబురు అందించింది. 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఉచితంగా అప్డేట్ చేయించుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యూఐడీఏఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎప్పటివరకు ఈ అవకాశం ఉంటుందనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

Aadhaar Card: ఆధార్ కార్డు వాడేవారికి కేంద్రం సూపర్ న్యూస్.. ఉచితంగా అప్డేట్ చేయించుకోవచ్చు.. అప్పటివరకే ఛాన్స్..
Aadhaar Card

Updated on: Mar 18, 2026 | 12:21 PM

ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆధార్ కార్డులోని బయోమెట్రిక్స్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ సదుపాయం అమల్లో ఉంటుంది. కానీ ఇది కేవలం పిల్లలకు మాత్రమే. 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఉచితంగా తమ ఆధార్ కార్డు బయోమెట్రిక్స్‌ను ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఛార్జీలను యూఐడీఏఐ వసూలు చేయదు. సాధారణంగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలంటే కొంత సర్వీస్ ఛార్జీ వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ 5-17 సంవత్సరాల వయస్సువారికి ఉచితంగా సేవలు అందించనుంది.

సెప్టెంబర్ తర్వాత ఛార్జీలు

5-17 సంవత్సరాల మధ్య ఉన్నవారు బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవడాన్ని యూఐడీఏఐ తప్పనిసరి చేసింది. ఎందుకంటే చిన్నతనంలో ఆధార్ తీసుకుని ఉంటారు. అయితే వయస్సు పెరిగాక బయోమెట్రిక్స్ మారుతూ ఉంటాయి. దీంతో ఈ వయస్సు మధ్య ఉన్నవారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఆధార్ సేవలు పొందటంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఏదైనా ధృవీకరణ కోసం బయోమెట్రిక్స్ నమోదు చేసేటప్పుడు పనిచేయకపోవచ్చు. దీంతో పిల్లలు కొద్ది వయస్సుకు వచ్చాక తల్లిదండ్రులు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ వివరాలను అప్డేట్ చేయించాలి. సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి ఉచితంగా అప్డేట్ చేయించవచ్చు. సెప్టెంబర్ తర్వాత అప్డేట్ చేయించాలంటే రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా చేయించవచ్చు.

స్కూళ్లల్లో క్యాంపులు

ఇక ఆధార్ సర్వీస్ సెంటర్లే కాకుండా దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో యూఐడీఏఐ ఉచిత క్యాంపులు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రత్యేక శిబిరాల్లో విద్యార్థులు ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేయించుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు. ఏపీ, తెలంగాణలో కూడా ఇలాంటి క్యాంపులు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ప్రతీ నెలా తొలివారంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా వీటిని నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలామంది విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయలేదు. దీంతో ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఉచితంగా అప్డేట్ చేసే సేవలను యూఐడీఏఐ తీసుకొచ్చింది. కాగా దేశంలోని ఆధార్ సర్వీస్ సెంటర్లను సులువుగా గుర్తించేలా గూగుల్ మ్యాప్స్‌లో రిజిస్టర్ చేయనున్నారు. ఇందుకోసం ఇటీవల గూగుల్‌తో కేంద్రం ఒప్పందం కుదిరింది. ఆధార్ సెంటర్ లొకేేషన్‌తో పాటు అక్కడ ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయనే విషయాలు ముందుగా తెలుసుకోవచ్చు.

Follow Us