
రైల్లో ఒక ప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి వెళ్లేందుకు రైల్వే టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లి టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే రిజర్వుడ్ టికెట్‌ను మీరు పొరపాటున ఇంట్లో మర్చిపోయారనుకుందాం. ఇలాంటి సమయంలో టికెట్ లేకపోతే ప్రయాణం చేయలేమని చాలామంది అనుకుంటారు. రైలు ఎక్కాక టీటీఈకి టికెట్ చూపించకపోతే మీకు భారీగా జరిమానా విధిస్తారు. ఒకవేళ మీరు రిజర్వుడు టికెట్‌ను ఇంట్లో మర్చిపోయినా రైలు ప్రయాణం చేయవచ్చు. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో రైలు ప్రయాణం ఎలా చేయాలి..? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు టికెట్‌ను మర్చిపోతే మీ కుటుంబ సభ్యుల సాయంతో మీ బోర్డింగ్ స్టేషన్‌లోని స్టేషన్ మాస్టర్‌కు అప్పగించాలి. స్టేషన్ మాస్టర్ టికెట్ చెక్ చేసి తదుపరి స్టేషన్‌కు అధికారిక సందేశాన్ని పంపుతారు. దీంతో ట్రైన్లో ఉండే రైల్వే అధికారులు మీ టిక్కెట్‌ను నిర్ధారిస్తారు. దీని ద్వారా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. టీటీఈ వచ్చి టికెట్ అడిగినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నుంచి ఫిజికల్ టిక్కెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ఈ నియమం పనిచేయదు.
మీరు ఇంట్లో టికెట్ మర్చిపోతే రైలులోని TTE (ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్)కి తెలియజేయండి. మీ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి అసలు టిక్కెట్‌ను స్టేషన్ మాస్టర్‌కు అందించమనండి. స్టేషన్ మాస్టర్ సంబంధిత రైల్వే అధికారులకు తెలియజేస్తారు. దీని ద్వారా మీరు ప్రయాణం చేయవచ్చు. ఈ మేరకు రిజర్వుడ్ ఆఫ్‌లైన్ టికెట్లక రైల్వేశాఖ నిబంధనలు విధించింది. ఇక ఆన్‌లైన్ టికెట్లకు ఈ రూల్ వర్తించదు. కేవలం రిజర్వేషన్ కౌంటర్ల నుంచి టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది.