ట్రైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, రద్దు చేయడానికి భారతీయ రైల్వే ఆన్‌లైన్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇతర ఆన్‌లైన్ సేవల మాదిరిగానే, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్‌ను బుక్ చేయడానికి, దాన్ని రద్దు చేయడానికి మీకు లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ అవసరం. అయితే చాలా మంది చాలా కాలం తర్వాత వెబ్‌సైట్‌ని సందర్శించినప్పుడు ముఖ్యంగా ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్ వర్డ్ మర్చిపోతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ వివిధ విధానాల ద్వారా పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడానికి సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. మీరు మీ ఈ-మెయిల్ ఐడీ మొబైల్ నంబర్ సహాయంతో ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్‌ను ఎలా రీసెట్ చేసుకోవాలో? ఓ లుక్కేద్దాం.
ఈ-మెయిల్ ఐడీతో ఇలా
- ముందుగా మీరు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ ఫర్‌గాట్ పాస్ వర్డ్‌ను ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. అక్కడ మీరు సెక్యూరిటీ క్వశ్చన్‌కు సమాధానం ఇవ్వాలి. ఈ ప్రశ్న మీరు ఖాతా తీసుకున్నప్పుడు పెట్టుకుని ఉంటారు.
- ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇస్తే మీకు ఐఆర్‌సీటీసీ నుంచి ఈ-మెయిల్ వస్తుంది. ఈ ఈ-మెయిల్‌లో పాస్ వర్డ్ రీసెట్ చేయడానికి సూచనలు ఉంటాయి.
- మీ పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడానికి ఈ-మెయిల్‌లోని సూచనలను అనుసరించి ఈజీగా పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చు.
ఫోన్ నంబర్‌తో పాస్ వర్డ్ రీసెట్ ఇలా
- ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- అక్కడ లాగిన్ ఆప్షన్‌ను ఎంచుకుని, అనంతరం ఓపెన్ అయిన పేజీలో ఫర్గాట్ పాస్‌వర్డ్‌ను ఎంచుకుని అనంతరం క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయాలి.
- అనంతరం ఓపెన్ అయిన పేజీలో మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
- ఆ తర్వాత నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
- ఓటీపీ నమోదు చేసిన తర్వాత మీకు న్యూ పాస్ వర్డ్ రీసెట్ చేసుకునేలా నూతన పేజీ ఓపెన్ అవుతుంది.
- అనంతరం అక్కడ నూతన పాస్ వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే కొత్త పాస్‌వర్డ్ సెట్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి