ప్రస్తుతం దేశంలో ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగింది. ప్రజల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. సంపాదన మొదలు పెట్టిన రోజు నుంచే సేవింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టాట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. టెక్నాలజీ పెరగడంతో ప్రతీ ఒక్కరికీ స్టాట్ మార్కెట్‌పై అవగాహన పెరుగుతోంది. దీంతో పెట్టుబడి పెడుతున్నారు. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే నష్టాలు వస్తాయనే అపోహలో ఉంటారు ఎక్కువ మంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా స్టాక్ మార్కెట్లో లాభాలు పొందొచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..
* స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ముందు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో లాభాలు ఎలా పొందొచ్చు. ఎలా పెట్టుబడి పెట్టాలి.? లాంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఈ డిజిటల్ యుగంలో ఆన్‌లైన్‌లో ఎంతో సమాచారం అందుబాటులో ఉంది.
* స్టాక్ మార్కెట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. చాలా మంది భారీ పెట్టుబడి పెడుతుంటారు. అయితే తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ లాభాలు పొందొచ్చు. దీంతో మార్కెట్లో ఎలాంటి ఒడిదుడులు ఎదురైనా పెద్దగా నష్టపోరు. కేవలం రూ. 5 ప్రారంభ పెట్టుబడితోనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
* స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే సమయంలో కంపెనీలను ఎంచుకోవడం అన్నింటికంటే ముఖ్యమైన అంశం. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న కంపెనీలు ట్రాక్ రికార్డును గమనించాలి. గతంలో ఆయా కంపెనీల లాభాలు ఎలా ఉన్నాయి.? పెట్టుబడి పెట్టడం ద్వారా ఎంత వరకు లాభాలు ఆర్జించవచ్చు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
* పెట్టుబడిని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా. నెలనెలకు ఇన్వెస్ట్మెంట్‌ను పెంచుతూ పోవాలి. ఇలా నిరంతరం పెట్టుబడి పెడుతూ పోతుంటే మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
* రిటైల్ ఇన్వెస్టర్లు తరచూ చౌక స్టాక్‌లపై దృష్టి పెడుతుంటారు. తక్కువ ధర ఉన్న స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ సంపాదించవచ్చని భావిస్తుంటారు. కానీ ఇందులో నిజం లేదు. కంపెనీ వృద్ధిని దృష్టిలో పెట్టుకొని స్టాక్‌లను కొనుగోలు చేయాలి. తక్కువ ధర ఉన్న స్టాక్‌లు పెద్దగా లాభాలు తీసుకురావనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
* ఒకవేళ స్టాక్ మార్కెట్‌లో వచ్చే ఆదాయంలో కొత్త భాగాన్ని వేరే చోట సురక్షితంగా పెట్టుబడి పెడుతుండాలి. భారీగా లాభాలు వస్తే ల్యాండ్‌పై ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..