Flipkart Delivery : ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం… ఆర్డర్‌ చేసిన గంటన్నరలో ప్రొడక్ట్‌ డెలివరీ.. ప్రస్తుతం ఏయే నగరాల్లో అంటే..!

|

Apr 22, 2021 | 12:52 PM

Flipkart Quick Delivery :ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్‌ చేసినట్లయితే మనకు అందే వరకు కనీసం ఒకటి లేదా రెండు రోజుల సమయం పడుతుంది. కానీ ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే...

Flipkart Delivery : ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం... ఆర్డర్‌ చేసిన గంటన్నరలో ప్రొడక్ట్‌ డెలివరీ.. ప్రస్తుతం ఏయే నగరాల్లో అంటే..!
Flipkart Quick Delhivery
Follow us on

Flipkart Quick Delivery : ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్‌ చేసినట్లయితే మనకు అందే వరకు కనీసం ఒకటి లేదా రెండు రోజుల సమయం పడుతుంది. కానీ ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అదే రోజు ఈ-కామర్స్‌ కంపెనీలు డెలివరీ రావడానికి కనీసం ఒకరోజైనా సమయం పడుతుంది. కానీ గంటన్నరలో డెలివరీ చేస్తామంటూ ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌ పేరుతో కొత్త సర్వీసును ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న హైపర్‌ లోకల్‌, సూపర్‌ ఫాస్ట్‌ సర్వీసు ఇది. ఈ సర్వీసు పరిధిలోకి వచ్చే ప్రోడక్ట్స్‌ని ఆర్డర్‌ చేస్తే కేవలం 90 నిమిషాల్లో ఇంటికి వస్తాయి. గతంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ సర్వీసును ప్రయోగాత్మకంగా ఫ్లిప్‌ కార్ట్ పరీక్షించింది.

ప్రస్తుతం ఏయే నగరాల్లో అంటే..

ప్రయోగాత్మకంగా గంటన్నరలో డెలివరీ చేస్తామని ప్రకటించిన ఫ్లిప్‌ కార్ట్‌.. ప్రస్తుతం ఢిల్లీ, ఘజియాబాద్‌, నోయిడా, హైదరాబాద్‌ గుర్గావ్‌, పూణె వంటి నగరాల్లో క్విక్‌ కింద ఈ సేవలను అందించనున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో హైపర్‌ లోకల్‌ సర్వీసు ద్వారా ప్రజలు తమ రోజువారీ అవసరాలను 90 నిమిషాల్లో పొందవచ్చు అని ప్రకటించింది. ఇతర మెట్రో నగరాలు కూడా ఈ సేవలో దశలవారీగా రానున్నట్లు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ జూలై 2020లో ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌ బ్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో తాజా పండ్లు, కూరగాయలు, మాంసం, కిరాణ వస్తువులు, మొబైల్స్‌, ఎలక్ర్టానిక్‌, శిశువు సంరక్షణ ఉత్పత్తులు 90 నిమిషాల్లో డెలివరీ చేయనున్నారు.

ఈ డెలివరి కింద 3 వేలకుపైగా ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సేవలు బెంగళూరుకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. అయితే ఇప్పుడు ఆరు కొత్త నగరాలను కవర్‌ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. మొదటి ఆర్డర్‌పై డెలివరీ ఉచితం. ఆ తర్వాత రూ.499 కన్నా ఎక్కువ ఆర్డర్లపై ఉచిత డెలివరీ ఉంటుందని తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు ఎప్పుడైన ఆర్డర్‌ చేయవచ్చని సూచించింది. అయితే కస్లమర్లకు వీలైనంత త్వరగా ప్రొడక్ట్స్‌ని డెలివరీ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌ షాడోప్యాక్స్‌ లాంటి లాజిస్టిక్స్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇవీ చదవండి: Public Provident Fund Scheme: పీపీఎఫ్‌ స్కీమ్‌లో చేరితే రూ.10 లక్షలు సంపాదించవచ్చు… ఎలాగంటే..!

మీకు ఎస్‌బీఐలో రుణాలు ఇప్పిస్తామని ఫోన్‌లు వస్తున్నాయా..? అయితే తస్మాత్‌ జాగ్రత్త…వెలుగులోకి వస్తున్న మోసాలు

LIC: ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసీ రికార్డు… కొత్త బిజినెస్‌ ప్రీమియం ఆదాయం రూ.1.84 లక్షల కోట్లు