వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ప్రసిద్ధ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. ప్రస్తుతం ఎలాంటి ఆఫర్ సేల్స్ లేనప్పటికీ.. ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ google pixel 6a పై భారీ తగ్గింపు ధరను ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా జరిపే కొనుగోలుపై ఈ ఆఫర్ వర్తిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. మీరు కూడా బడ్జెట్‌లో, మంచి ధరలో నాణ్యమైన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ ఆఫర్ నిజంగా అద్భుతం అని చెప్పాలి.
ఇండియాలో Google Pixel 6a స్మార్ట్‌ఫోన్ ధర 6GB +128GB స్టోరేజ్ వెర్షన్‌కు రూ.43,999 గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 30,999కి పొందవచ్చు. అంటే దాదాపు 29% శాతం ఆఫర్ ప్రకటించింది. ఇది కాకుండా సుమారు రూ.18,500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది.
Google Pixel 6a స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల పూర్తి HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 1,080 x 2,400 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఆక్టా-కోర్ గూగుల్ టెన్సర్ GS101 SoC ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 అవుట్ ది బాక్స్‌ను రన్ చేస్తుంది.
ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరాలో 12-మెగాపిక్సెల్ సెన్సార్, రెండవ కెమెరా అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 12.2-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ సెన్సార్ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ వెనుక కెమెరా 30fpsతో 4K వీడియో రికార్డింగ్ సదుపాయం ఉంది. సెల్ఫీ కెమెరా 30fps వద్ద 1080p వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
Google Pixel 6a స్మార్ట్‌ఫోన్ 4,306mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఉంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..