Flipkart Big Saving Days Sale: ఫ్లిప్​కార్ట్ సమ్మర్​ స్పెషల్ సేల్​.. భారీ డిస్కౌంట్‌.. ఎప్పటి నుంచి అంటే..!

Flipkart Big Saving Days Sale: ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ స్పెషల్‌ బిగ్‌సేవింగ్‌ డేస్‌ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్‌ మే 2న ప్రారంభమై 7వ తేదీన ముగియనున్నట్లు..

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్​కార్ట్ సమ్మర్​ స్పెషల్ సేల్​.. భారీ డిస్కౌంట్‌.. ఎప్పటి నుంచి అంటే..!
Flipkart Big Saving Days Sale

Updated on: Apr 27, 2021 | 5:24 PM

Flipkart Big Saving Days Sale: ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ స్పెషల్‌ బిగ్‌సేవింగ్‌ డేస్‌ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్‌ మే 2న ప్రారంభమై 7వ తేదీన ముగియనున్నట్లు ప్రకటించింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ యూజర్లకు ఒక రోజు ముందుగానే అంటే మే 1వ తేదీన ఈ ఆఫర్‌ అందుబటులోకి రానుంది.

స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలపై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ముఖ్యంగా యాపిల్‌, వివో, శాంసంగ్‌, షియోమీ, ఆసుస్‌ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఎలక్ట్రానిక్‌ ఉపకరనాలపై 80 శాతం వరకు, టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ 62 ధర రూ.17,999 నుంచి ప్రారంభం కానుంది. ఎఫ్​ 41 (6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వేరియంట్) రూ.12,999కే లభించనుంది.

పోకో ఎక్స్​3 (6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్​ వేరియంట్​)ని రూ.14,999కి కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఐఫోన్ 11 రూ.44,999, ఆసుస్​ రాగ్​ ఫోన్ 3 రూ.41,999కు, ఐకూ 3 రూ.24,990కి లభించనున్నాయి. గూగుల్ పిక్సెల్ 4ఏ ధర రూ.26,999గా నిర్ణయించింది ఫ్లిప్​కార్ట్​.ఈ ఆఫర్లన్నింటితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ అందించనున్నట్లు తెలిపింది. అంతేకాదు ఈఎంఐలకు కూడా ఈ ఆఫర్ వర్తించనున్నట్లు ఫ్లిప్​కార్ట్ తెలిపింది.

ఇవీ చదవండి:

Indane Gas Booking: మీరు గ్యాస్‌ సిలిండర్ బుక్‌ చేస్తున్నారా..? ఈ నెంబర్‌ చెబితేనే గ్యాస్‌ డెలివరి అవుతుంది..!

UPI: యూపీఐ అంటే ఏమిటి..? దీని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి