5జీ ట్రెండ్ మొదలైంది. జియో, ఎయిర్ టెల్ వంటి టెలికాం సంస్థలు ఇప్పటికే అన్ని నగరాల్లో తమ సేవలను ప్రారంభించాయి. దీంతో వినియోగదారులు కూడా 5జీ మొబైళ్ల కోసం వేట ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ 5జీ ఫోన్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా రెండూ ప్లాట్ ఫామ్ లపై పలు ఆఫర్లు ప్రకటించాయి. పిక్సల్ 6ఏ, నథింగ్ ఫోన్ 1 సామ్సంగ్ గేలాక్సీ ఎస్22, రెడ్మీ 11 ప్రైమ్ వంటి మోడళ్లపై ఆఫర్లు ఉన్నాయి. ఈ డీల్స్ రూ. 11,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆఫర్లపై ఓ లుక్ వేద్దాం..
సామ్సంగ్ ఫోన్లను ఇష్టపడే వినియోగదారులకు ఇది గుడ్ న్యూస్. అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా గేలాక్సీ ఎం13 5జీ( Galaxy M13 5G)మోడల్ ఫోన్ కేవలం రూ. 11,999 లకే లభిస్తోంది. ఇదే రేంజ్, ఇదే ఫీచర్లతో కూడిన రెడ్మీ 11 ప్రైమ్ అదే అమోజాన్ లో 12,999కు దొరుకుతోంది. దీనిపై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా మరో రూ.1250 తగ్గే అవకాశం ఉంటుంది.
ఫ్లిప్ కార్ట్ లో నథింగ్ ఫోన్1 ధర గణనీయంగా తగ్గింది. దీనిలో కేవలం రూ. 27,499 కే లభిస్తోంది. దీని సాధారణ ధర రూ. 31,000 ఉంది. అలాగే రెడ్మీ కె50ఐ(Redmi K50i) కూడా రూ. 20,999కే దొరుకుతుంది. రియల్ మీ నార్జో 50 ప్రో(Realme Narzo 50 Pro) బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ. 17,999కే లభిస్తోంది.
ఐ ఫోన్ 13 కూడా కేవలం రూ. 59,499 కే రిపబ్లిక్ డే సేల్ లో లభ్యమవుతోంది. అలాగే పిక్సల్ 6ఏ కూడా 29,999లకే దొరుకుతోంది. ఇక సామ్సంగ్ గేలాక్సీ ఎస్22 కూడా చాలా తక్కువ ధరకే లభ్యమవుతోంది. దీని ధర రూ. 51,749 కే అందుబాటులో ఉంది. అలాగే గేలాక్సీ ఎస్ 22ప్లస్ మోడల్ కూడా ఫ్లిప్ కార్ట్ లో రూ. 59,999లకే లభ్యమవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..