Flight Ticket: ముగిసిన విమానయాన కంపెనీల బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.1498కే విమాన టికెట్‌

|

Jul 31, 2022 | 8:48 PM

Flight Ticket: విమాన టికెట్: ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా గత కొన్ని నెలలుగా విమాన ప్రయాణం చాలా ఖరీదైనదిగా మారింది. ఏడాది కాలంలో చాలా విమానయాన కంపెనీలు టికెట్‌ ధరలను పెంచేశాయి. అయితే మీరు ఇప్పుడు మరోసారి తక్కువ ధరల్లో టికెట్‌ కొనుగోలు చేసి విమానంలో ప్రయాణించవచ్చు. కొన్ని ఎయిర్‌లైన్స్‌ చౌకగా టికెట్లను అందిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. స్పైస్‌జెట్: స్పైస్‌జెట్ దేశీయ విమానాలకు రూ.1498 నుంచి చౌకగా విమాన టిక్కెట్లను అందిస్తోంది. దీనికి కంపెనీ […]

Flight Ticket: ముగిసిన విమానయాన కంపెనీల బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.1498కే విమాన టికెట్‌
Follow us on

Flight Ticket: విమాన టికెట్: ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా గత కొన్ని నెలలుగా విమాన ప్రయాణం చాలా ఖరీదైనదిగా మారింది. ఏడాది కాలంలో చాలా విమానయాన కంపెనీలు టికెట్‌ ధరలను పెంచేశాయి. అయితే మీరు ఇప్పుడు మరోసారి తక్కువ ధరల్లో టికెట్‌ కొనుగోలు చేసి విమానంలో ప్రయాణించవచ్చు. కొన్ని ఎయిర్‌లైన్స్‌ చౌకగా టికెట్లను అందిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి.

స్పైస్‌జెట్: స్పైస్‌జెట్ దేశీయ విమానాలకు రూ.1498 నుంచి చౌకగా విమాన టిక్కెట్లను అందిస్తోంది. దీనికి కంపెనీ సేల్ సీజన్ అని పేరు పెట్టింది. ఈ సేల్ కింద జూలై 28 నుంచి జూలై 31 వరకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంది. ఈ రోజుతో ఈ టికెట్‌ బుక్‌ చేసుకునే గడువు ముగియనుంది.ఈ టిక్కెట్‌పై ఆగస్టు 15, సెప్టెంబర్ 25 మధ్య ప్రయాణించవచ్చు.

ఇండిగో: అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో దేశీయ విమానాలకు రూ.1,499 నుంచి చౌకగా విమాన టిక్కెట్లను అందిస్తోంది. మీరు ఈ ఆఫర్ కింద జూలై 28, 2022 నుండి జూలై 31, 2022 వరకు చౌక టిక్కెట్‌లను బుక్ చేసుకున్నవారికి మాత్రమే. ప్రయాణం వ్యవధి 15 ఆగస్టు 2022 నుండి 31 డిసెంబర్ 2022 మధ్య ఉంటుంది. మీరు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణించగలరు.

ఇవి కూడా చదవండి

గోఫస్ట్: తన కస్టమర్ల కోసం రాక్ బాటమ్ సేల్‌తో ముందుకు వచ్చింది. విమానయాన సంస్థ దేశీయ విమానాలకు రూ.1799 నుంచి విమాన టిక్కెట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద జూలై 28- జూలై 31 మధ్య బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్‌ ఉంటుంది. ఆగస్టు 15, 2022 నుండి మార్చి 31, 2023 వరకు ప్రయాణించవచ్చు.

ఎయిర్ ఏషియా ఇండియా:ఎయిర్ ఏషియా ఇండియా ‘పే డే సేల్’తో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్ కింద విమానయాన సంస్థ ఢిల్లీ-జైపూర్ వంటి రూట్లలో రూ.1,499 నుంచి విమాన టిక్కెట్లను అందిస్తోంది. జూలై 28- జూలై 31 మధ్య బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయాణం వర్తిస్తుంది. ప్రయాణ కాలం ఆగస్టు 15 నుండి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఎయిర్ ఏషియా ఇండియా తన నెట్‌వర్క్‌లో మరిన్ని డిస్కౌంట్ సేల్ ఆఫర్‌లను కూడా తీసుకొచ్చింది. అయితే ఈ టికెట్లు కొనుగోలు ఈ రోజుతే ముగియనుంది.

విదేశాలకు వెళ్లే అవకాశం పూర్తిగా ఉచితం: వియత్నాంకు చెందిన విమానయాన సంస్థ వియట్‌జెట్ మళ్లీ చౌక విమాన టిక్కెట్ల ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఎయిర్‌లైన్ దాదాపు 30,000 ప్రమోషనల్ టిక్కెట్‌లను అందిస్తోంది. ఈ టిక్కెట్లు భారతదేశం, వియత్నాం మధ్య 17 మార్గాల కోసం ఈ టికెట్లను పొందవచ్చు. ప్రయాణికులు 26 ఆగస్టు 2022 వరకు ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో ఈ చౌక ప్రమోషనల్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రయాణం వ్యవధి 15 ఆగస్టు 2022 నుండి 26 మార్చి 2023 వరకు ఉంటుంది. ఈ ఆఫర్‌లో మీరు కేవలం రూ.9తో విమాన ప్రయాణ టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి