
దేశీయ లేదా అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణాలను ప్లాన్ చేస్తున్నప్పుడు చాలా మంది భారతీయ ప్రయాణికుల మనస్సుల్లో ప్రయాణ బీమాను కొనుగోలు చేయాలనే ఆలోచన చాలా అరుదుగా వస్తుంది. బడ్జెట్ పరిమితుల కారణంగా వారు తరచుగా దీనిని భరించలేని లగ్జరీగా భావిస్తారు. అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో విమానం క్యాన్సిల్ అయితే మనకు కలిగే నష్టాన్ని బీమా ద్వారా భర్తీ చేసుకోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ప్రయాణ బీమా సాంప్రదాయకంగా వైద్య అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, సామగ్రి లేదా పత్రాల నష్టాన్ని కవర్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో వాతావరణ సంబంధిత అంతరాయాల సమయంలో ప్రయాణ బీమా ప్రాముఖ్యతను చాలా మంది ఎక్కువగా పరిశీలిస్తున్నారు. ప్రతికూల వాతావరణంతో సహా వివిధ కారణాల వల్ల విమానాలు రద్దు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ట్రిప్ రద్దు లేదా ఆలస్యం వంటి పరిణామాలను ప్రయాణ బీమా కవర్ చేస్తుందని నిపుణులు చెబుతుేన్నారు. అలాగే ప్యాకేజీ ట్రిప్‌లలో టూర్ ఆపరేటర్లు రద్దు చేసిన వాటిని చాలా పాలసీల కింద తిరిగి పొందలేమని కూడా వివరిస్తున్నారు. వరదలు లేదా భారీ వర్షం వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనల సమయంలో విమాన ఆలస్యం, ట్రిప్ రద్దు అనేది అత్యంత సాధారణ క్లెయిమ్‌లుగా ఉంటాయి. ఇలాంటి సంఘటనలు ప్రయాణ ప్రణాళికలను నేరుగా దెబ్బతీస్తాయి. అలాగే పేర్కొన్న కనీస సమయాన్ని మించిపోతే బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా పాలసీదారుడు విదేశాల్లో ఉన్నప్పుడు నష్టం జరిగితే ప్రయాణ అంతరాయాలను కవర్ చేయడమే కాకుండా భారతదేశంలో కూడా బీమా క్లెయిమ్ అయ్యేలా రక్షణ కల్పించే పాలసీలను ఎంచుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి తర్వాత వాతావరణ అంతరాయం మధ్య ప్రయాణికులు మరింత బలమైన బీమాను ఎంచుకుంటున్నారని నిపుణులు వివరిస్తున్నారు. చాలా మంది వైద్య ఖర్చులు, మోసం లేదా చివరి నిమిషంలో రద్దులను కవర్ చేయడానికి 2,50,000 డాలర్లు నుంచి 5,00,000 డాలర్ల వరకు అధిక మొత్తంలో బీమా ఉన్న పాలసీలను ఇష్టపడుతున్నారని పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి