Flexi Deposit Scheme: ఎస్బీఐ ఖాతాదారులకు మరిన్ని సేవలు.. కొత్తగా ‘ఫ్లెక్సీ డిపాజిట్‌ స్కీమ్‌’

|

Jan 18, 2021 | 4:03 PM

Flexi Deposit Scheme: దేశంలో అతిపెద్ద బ్యాకింగ్‌ రంగమైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ ఖాతాదారుల కోసం అనేక రకాలైన సేవలు అందుబాటులోకి తీసుకువస్తుంటుంది..

Flexi Deposit Scheme: ఎస్బీఐ ఖాతాదారులకు మరిన్ని సేవలు.. కొత్తగా ఫ్లెక్సీ డిపాజిట్‌ స్కీమ్‌
Follow us on

Flexi Deposit Scheme: దేశంలో అతిపెద్ద బ్యాకింగ్‌ రంగమైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ ఖాతాదారుల కోసం అనేక రకాలైన సేవలు అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. తాజాగా ఖాతాదారులకు కొత్త రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిలో ‘ఫ్లెక్సీ డిపాజిట్‌ స్కీమ్‌’ కూడా ఒకటి. దీని ద్వారా ప్రతి నెల డిపాజిట్‌దారులు సాధ్యమైనంత మొత్తాన్నే డిపాజిట్‌ చేయవచ్చు. ఇందులో ఒకేసారి డబ్బు జమ చేయాలన్న నిబంధన ఏమి లేదు. ఫ్లెక్సీ డిపాజిట్‌ స్కీమ్‌లో ఏ సమయంలోనైనా డబ్బు డిపాజిట్‌ చేసుకోవచ్చు. నెలకు కనీసం 500 రూపాయలు డిపాజిట్‌ చేసే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.5వేల నుంచి గరిష్టంగా రూ.50 వేల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది.

అయితే ఈ ఫ్లెక్సీ డిపాజిట్‌ స్కీమ్‌లో చేరితే కనీసం ఐదు సంవత్సరాల డబ్బు డిపాజిట్‌ చేసుకుంటూ వెళ్లాలి. ఏడు సంవత్సరాల వరకు కూడా డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా, టర్మ్‌ డిపాజిట్‌కు వర్తించే వడ్డీ రేటు ఈ ఫ్లెక్సీ పథకానికి కూడా వర్తిస్తుంది. ఇందులో 5.4 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఇక సీనియర్‌ సిటిజన్లకు మాత్రం 0.5 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇక వినియోగదారులు తమ ఫ్లెక్సీ ఖాతాలో ఉన్న డబ్బుపై 90 శాతం మొత్తాన్ని రుణం కింద తీసుకునే వెలుసుబాటు కూడా ఉంటుంది.

Also Read: SBI: వినియోగదారులను జాగ్రత్తగా ఉండమని చెబుతోన్న ఎస్‌బీఐ.. ఎట్టి పరిస్థితుల్లో ఆ వివరాలు ఇవ్వొద్దంటూ.. ట్వీట్‌..