Finance Planning: మీ పిల్లల చదువుకోసం డబ్బు సేవ్ చేయాలనుకుంటున్నారా.. అయితే చిన్న మెుత్తంలో ఇలా చేయండి..

|

Mar 01, 2022 | 7:15 AM

Finance Planning: మీ పిల్లవాడిని(Children Education) ప్రఖ్యాత, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీలో చేర్పిస్తే, మీకు దేశీయ కళాశాలలో సుమారు రూ. 15-20 లక్షలు.. అదే విదేశాల్లో అయితే దాదాపు రూ. 1.8 కోట్లు ఖర్చు అవుతుంది.

Finance Planning: మీ పిల్లల చదువుకోసం డబ్బు సేవ్ చేయాలనుకుంటున్నారా.. అయితే చిన్న మెుత్తంలో ఇలా చేయండి..
Children Education
Follow us on

Finance Planning: మీ పిల్లవాడిని(Children Education) ప్రఖ్యాత, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీలో చేర్పిస్తే, మీకు దేశీయ కళాశాలలో సుమారు రూ. 15-20 లక్షలు.. అదే విదేశాల్లో అయితే దాదాపు రూ. 1.8 కోట్లు ఖర్చు అవుతుంది. అదే MBA, IIM వంటి వాటిలో కనీసం రూ. 25 లక్షల వరకు అవసరం అవుతుంది. ఒకవేళ ప్రభుత్వ కళాశాలలను పరిశీలిస్తే.. అగ్రశ్రేణి కళాశాలలు విద్యార్థల నుంచి తీవ్ర పోటీని కలిగి ఉంటున్నాయి. ఇప్పటి నుంచి రానున్న 10 – 20 సంవత్సరాల తరువాత, జనాభా పెరగడం వల్ల ఈ పోటీ మరింతగా పెరుగుతుంది. అందువల్ల విద్యకు ప్రాముఖ్యత పెరుగుతున్నందున పిల్లల విద్యకు అవసరమైన మెుత్తాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తల్లిదండ్రులు ఇలా సేవ్ చేయటం ఒక ఉత్తమమైన మార్గం. అదేమిటంటే మ్యూచువల్ ఫండ్లలో సిప్ రూపంలో డబ్బు ఇన్వెస్ట్ చేయటం. ఇందుకోసం మీరు కనీసపెట్టుబడిగా రూ. 500 నుంచి సిప్ చేయటం ప్రారంభించవచ్చు.

ఉదాహరణ..

మీరు 10 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 5000 పెట్టుబడి పెట్టండి. కనీసం రిటన్ దానిపై 12% చక్రవడ్డీని లెక్కిస్తే రూ. 11.50 లక్షలు అవుతుంది. అదే విధంగా రూ. 9 లక్షలను 15 సంవత్సరాల పాటు పెట్టుబిడిగా 12 శాతం వడ్డీకి పెడితే అది రూ. 25.23 లక్షలకు చేరుతుంది. అంటే ఆ మెుత్తాన్ని మరో 5 ఏళ్లు అలాగే కొనసాగిస్తే డబుల్ అవుతుంది. ఈ పెట్టుబడిని 20 ఏళ్లు కొనసాగిస్తే.. మీరు పెట్టే మెుత్తం సొమ్ము రూ. 12 లక్షలు కాస్తా.. రూ. 49.96 లక్షలకు పెరుగుతుంది. ఇక్కడ మనం కేవలం 12 శాతం రాబడికి లెక్కగట్టాము. 20 శాతం రిటన్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే.. 20 సంవత్సరాల కాలంలో మీ రూ. 12 లక్షల పెట్టుబడి రూ. 1.58 కోట్లకు చేరుకుంటుంది.

ఇలా సిప్ ల రూపంలో సేవ్ చేస్తే.. మీరు మీ పిల్లల ఉన్నత విద్య గురించి ఎప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా వారి విద్య కోసం బ్యాంకుల నుంచి ఖరీదైన రుణాలను సైతం తీసుకోవలసిన అవసరం రాదు. లేదా తెలిసినవారి వద్ద అప్పులు చేయాల్సిన అవసరం రాదు. దాని వల్ల కుటుంబంపై ఆర్థిక భారం చాలా తక్కువగా ఉంటుంది.

ఇవీ చదవండి..

Interest Rates: కొత్తగా జనవరి తరువాత బ్యాంక్ లోన్ తీసుకున్నారా.. అయితే ఈ వివరాలు మీకోసమే..

TS Traffic Challans: నేటి నుంచి వాహనదారులకు బంపర్‌ ఆఫర్‌.. పెండింగ్‌ చలనాలపై భారీ రాయితీ