పన్ను వసూలు నిబంధనలు మారుతున్నాయి. ట్యాక్స్ కలెక్షన్ సోర్స్ (టీసీఎస్) నిబంధనలలో మార్పులు చేస్తున్నట్లు గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రచురించింది. ఈ నిబంధన జూలై నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ.. కొత్త టీసీఎస్ కలెక్షన్ రేటు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, “జులై 1 నుండి అమలులోకి రావాల్సిన TCS రేటు పెంపు అక్టోబర్ 1, 2023 నుండి అమలులోకి రాబోతోంది. ఒక్కో వ్యక్తికి ఏడాదికి రూ.7 లక్షల వరకు విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS 5 శాతం విధించబడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
నివేదిక ప్రకారం.. ఎల్‌ఆర్‌ఎస్ కింద టీసీఎస్ రేట్లలో ఎటువంటి మార్పు ఉండదు. ఏడాదికి ఏడు లక్షల వరకు ఇన్‌కమ్ ఉండే వ్యక్తులకు టీసీఎస్ ట్యాక్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది. అక్టోబర్ 1 నుంచి విదేశీ క్రెడిట్ కార్డ్ ఖర్చులపై టీసీఎస్ ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. 7 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపు విషయంలో అదనపు టీసీఎస్ చెల్లించాలి. ఈ సంవత్సరం యూనియన్ బడ్జెట్‌లో ఎల్‌ఆర్‌ఎస్ కింద టిసిఎస్ రేటును 5 శాతం నుంచి 20 శాతానికి పెంచారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి