Fixed Deposit: చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లు.. ఎఫ్‌డీలపై కొత్త రేట్లు..!

|

Apr 17, 2022 | 10:52 AM

Fixed Deposit: మార్కెట్‌లోని అనేక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ( SFB లు) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి. ఎఫ్‌డిలో సురక్షితమైన పెట్టుబడిని చూసి, ప్రజలు కూడా డబ్బును డిపాజిట్ చేస్తున్నారు...

Fixed Deposit: చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లు.. ఎఫ్‌డీలపై కొత్త రేట్లు..!
Follow us on

Fixed Deposit: మార్కెట్‌లోని అనేక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ( SFB లు) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి. ఎఫ్‌డిలో సురక్షితమైన పెట్టుబడిని చూసి, ప్రజలు కూడా డబ్బును డిపాజిట్ చేస్తున్నారు. డబ్బును సులభంగా పెట్టుబడి పెట్టడం, మెచ్యూరిటీలో త్వరలో నగదు చేతికి రావడం వల్ల FDలపై ఆసక్తి చూపుతారు. మీరు మార్కెట్‌లో FDపై వడ్డీ రేటును లెక్కించినట్లయితే అనేక ప్రైవేట్ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు సగటు FD రాబడి కంటే ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే అటువంటి బ్యాంకులు పెట్టుబడి అధిక నష్టాన్ని భరించలేవు. దీంతో ఖాతాదారుల సొమ్ము నిలిచిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఈ విషయంలో చర్యలు తీసుకుంటూ ఖాతాదారులను అప్రమత్తం చేసింది. కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకుల FD రేట్లను చూద్దాం.

AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ FDలపై 5.25 శాతం, 1 నుండి 2 సంవత్సరాల FDలపై 6.5 శాతం, 2 నుండి 3 సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.75 శాతం, 3 నుండి 5 సంవత్సరాల FDలపై 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. తర్వాత ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ 1 సంవత్సరం కంటే తక్కువ FDలపై 5%, 1 నుండి 2 సంవత్సరాల FDలపై 6.5%, 2 నుండి 3 సంవత్సరాల వరకు, 3 నుండి 5 సంవత్సరాల కాలవ్యవధికి 6.75 శాతం అందిస్తున్నాయి.

ఇక ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ FDలపై 5.15 శాతం, 1 నుండి 2 సంవత్సరాల FDలపై 6%, 2 నుండి 3 సంవత్సరాల FDలపై 6.5%, 3 నుండి 5 సంవత్సరాల FDలపై 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ FDలపై 5.5 శాతం, 1 నుండి 2 సంవత్సరాల FDలపై 6.5%, 2 నుండి 3 సంవత్సరాల FDలపై 6.75 శాతం, 3 నుండి 5 సంవత్సరాల FDలపై 6.75 శాతం వడ్డీని ఇస్తోంది.

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ FDలపై 5.75 శాతం, 1 నుండి 2 సంవత్సరాల FDలపై 6.5 శాతం, 2 నుండి 3 సంవత్సరాల FDలపై 7 శాతం, 3 నుండి 5 సంవత్సరాల FDలపై 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ FDలపై 4.75 శాతం, 1 నుండి 2 సంవత్సరాల FDలపై 6.6 శాతం, 2 నుండి 3 సంవత్సరాల FDలపై 6.75 శాతం, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల FDలపై 6.25 శాతం వడ్డీని అందిస్తోంది.

ఇవి కూడా చదవండి:

Policy Loan: మీరు బీమా పాలసీపై కూడా లోన్‌ తీసుకోవచ్చు.. రుణం పొందాలంటే ఎలాంటి పత్రాలు అవసరం..!

SBI Kavach Personal Loan: కరోనా బారిన పడిన వారికి ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్‌.. చికిత్స కోసం రుణం.. పూర్తి వివరాలు