Telugu News Business FD customers alert, Interest rates of FDs reduced in those banks, FD Interest Rates details in telugu
FD Interest Rates: ఎఫ్‌డీ ఖాతాదారులు అలెర్ట్.. ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీల వడ్డీ రేట్లు తగ్గింపు..?
భారతదేశంలో చాలా ఏళ్లుగా పెట్టుబడికి నమ్మకమైన సాధనంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లను ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే ఈ ఎఫ్‌డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడానికి ఆర్‌బీఐ ఎంపీసీ వచ్చే వారం సమావేశం కానుంది. అయితే డిసెంబర్ 2024 నుండి రేట్లను తగ్గించడం ప్రారంభించాలని భావిస్తున్నందున ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా తదుపరి నుంచి హేతుబద్ధీకరించే అవకాశం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంకులకు సంబంధించిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ప్రస్తుతం కంటే డిసెంబర్ నుంచి తగ్గించే అవకాశం ఉంది.
భారతదేశంలో చాలా ఏళ్లుగా పెట్టుబడికి నమ్మకమైన సాధనంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లను ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే ఈ ఎఫ్‌డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడానికి ఆర్‌బీఐ ఎంపీసీ వచ్చే వారం సమావేశం కానుంది. అయితే డిసెంబర్ 2024 నుండి రేట్లను తగ్గించడం ప్రారంభించాలని భావిస్తున్నందున ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా తదుపరి నుంచి హేతుబద్ధీకరించే అవకాశం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంకులకు సంబంధించిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ప్రస్తుతం కంటే డిసెంబర్ నుంచి తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లు సరాసరిన 7.9 శాతం వడ్డీని అందిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉంది. పదవీకాలాన్ని బట్టి రూ. 3 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.9 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ 7.8 శాతం వరకు ఇస్తుండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 7.50 శాతం వరకు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు బ్యాంకుల్లో ప్రస్తుతం వడ్డీరేట్లు ఎలా ఉన్నాయో? ఓ సారి తెలుసుకుదాం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లు
7 రోజుల నుండి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
46 రోజుల నుంచి ఆరు నెలల వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
6 నెలల 1 రోజు నుంచి 9 నెలల కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
9 నెలల 1 రోజు నుండి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
1 సంవత్సరం నుండి 15 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు – 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.10 శాతం
15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు – 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
18 నెలల నుంచి 21 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు, 7.75 శాతం
21 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
4 సంవత్సరాల 7 నెలల నుండి 55 నెలల వరకు సాధారణ ప్రజలకు – 7.40 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం
ఎస్‌బీఐ వడ్డీ రేట్లు
7 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
46 రోజుల నుంచి 179 రోజులు వరకు సాధారణ ప్రజలకు – 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.00 శాతం
180 రోజుల నుంచి 210 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం
211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు – 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు – 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.25 శాతం
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు – 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం.
ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీ రేట్లు
7 రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
46 రోజుల నుంచి 60 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 4.25 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
61 రోజుల నుంచి 90 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
91 రోజుల నుండి 184 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
185 రోజుల నుండి 270 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు – 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
1 సంవత్సరం నుండి 15 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు – 6.70 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.20 శాతం
15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.80 శాతం
18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు – 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం
2 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం