AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Expressways: ఇక హైవేలపై హైటెక్ సైన్ బోర్డులు.. వీటితో ఇన్ని ప్రయోజనాలా?

Expressways: హైవేల వెంట టోల్ ప్లాజాలు, ట్రక్ పార్కింగ్ స్థలాలు, విశ్రాంతి ప్రాంతాలు, వే ప్రారంభ/ముగింపు పాయింట్ల వద్ద QR కోడ్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఇది ప్రయాణికు వారి ప్రయాణ సమయంలో సహాయపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సమాచారాన్ని అందిస్తుంది. హైవే భద్రతను పెంచుతుంది..

Expressways: ఇక హైవేలపై హైటెక్ సైన్ బోర్డులు.. వీటితో ఇన్ని ప్రయోజనాలా?
Subhash Goud
|

Updated on: Oct 04, 2025 | 12:11 PM

Share

Expressways: దేశవ్యాప్తంగా హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయబోతోంది. కొత్త హైవేలు నిర్మించడమే కాకుండా ప్రభుత్వం పాత రోడ్లను అప్‌గ్రేడ్ చేసి, వాటికి హైటెక్ సౌకర్యాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా హైవేలను మరింత స్మార్ట్‌గా మార్చే దిశగా భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) ఇప్పుడు ఒక పెద్ద అడుగు వేయాలని నిర్ణయించింది. త్వరలో హైవేలపై QR కోడ్‌లను కలిగి ఉన్న హైటెక్ సైన్‌బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఒక ప్రయాణికుడు ఈ QR కోడ్‌లను తమ మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేసినప్పుడల్లా వారికి అవసరమైన పూర్తి సమాచారం తక్షణమే అందుతుంది.

ఇది కూడా చదవండి: ఒక శిశువు అంతర్జాతీయ విమానంలో జన్మిస్తే ఏ దేశ పౌరసత్వం లభిస్తుంది?

హైవేల వెంట టోల్ ప్లాజాలు, ట్రక్ పార్కింగ్ స్థలాలు, విశ్రాంతి ప్రాంతాలు, వే ప్రారంభ/ముగింపు పాయింట్ల వద్ద QR కోడ్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఇది ప్రయాణికు వారి ప్రయాణ సమయంలో సహాయపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సమాచారాన్ని అందిస్తుంది. హైవే భద్రతను పెంచుతుంది. ప్రస్తుతం ప్రజలు తమ ప్రయాణాల గురించి సమాచారం కోసం ఇంటర్నెట్‌లో శోధిస్తారు. కొన్నిసార్లు, అత్యవసర నంబర్‌లు లేదా ఇతర సమాచారం కోసం శోధిస్తున్నప్పుడు వారు సైబర్ మోసానికి గురవుతారు. QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అంత సమాచారాన్ని పొందడం డ్రైవర్లకు గొప్ప ప్రయోజనం చేకూరుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Viral Video: సీటు కోసం గొడవ.. మెట్రోలో పొట్టు పొట్టు కొట్టుకున్న ఇద్దరు ప్రయాణికులు!

హైవే సైన్ బోర్డుపై QR కోడ్‌ను స్కాన్ చేయడం వల్ల మీకు హైవే, దానిలోని అన్ని సౌకర్యాల సమాచారం పొందవచ్చు. ఈ సంకేతాలను స్కాన్ చేయడం వల్ల ప్రయాణికులకు హైవే ప్రాజెక్ట్ గురించి కీలక సమాచారం లభిస్తుంది. హైవే నంబర్, రోడ్డు పొడవు, అది ఎప్పుడు నిర్మించారు? ప్రస్తుతం మరమ్మత్తులో ఉందా లేదా అనేది. ముఖ్యమైన ఫోన్ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కోడ్‌ను స్కాన్ చేయడం వల్ల హైవే పెట్రోల్, టోల్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, 1033 అత్యవసర హెల్ప్‌లైన్, NHAI కార్యాలయాల నంబర్‌లు మీకు లభిస్తాయి.

ఇది కూడా చదవండి: Jio Plan: 365 రోజుల చెల్లుబాటుతో చౌకైన ప్లాన్ జియో ప్లాన్‌.. బెనిఫిట్స్‌ ఇవే!

అదనంగా QR కోడ్ సమీపంలోని సౌకర్యాల గురించి సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఉదాహరణకు ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, విశ్రాంతి గదులు, పోలీస్ స్టేషన్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు, టోల్ ప్లాజాల స్థానం, దూరం. QR కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత ట్రక్ పార్కింగ్, పంక్చర్ రిపేర్, ఇ-ఛార్జింగ్ స్టేషన్ల చిరునామా, స్థానం మీ మొబైల్ ఫోన్‌లో కూడా కనిపిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి