EV Charging Station: అక్కడ 121 కార్లకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టొచ్చు..! దాని స్పెషాలిటీలు మీ కోసం..

Mega Charging Station: దేశంలో మెగా ఛార్జింగ్ స్టేషన్(EV Charging Station) ను హర్యానాలో గురుగ్రామ్(Gurugram) లో ఏర్పాటు చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఏకకాలంలో 121 కార్లకు ఛార్జింగ్ పెట్టేందుకు అవసరమైన పూర్తి సౌకర్యాలు కలిగి ఉంది.

EV Charging Station: అక్కడ 121 కార్లకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టొచ్చు..! దాని స్పెషాలిటీలు మీ కోసం..
Ev Charging Stations

Edited By: Janardhan Veluru

Updated on: Mar 04, 2022 | 1:06 PM

EV Charging Station: దేశంలో మెగా ఛార్జింగ్ స్టేషన్(Megha Charging Station) ను హర్యానాలో గురుగ్రామ్(Gurugram) లో ఏర్పాటు చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఏకకాలంలో 121 కార్లకు ఛార్జింగ్ పెట్టేందుకు అవసరమైన పూర్తి సౌకర్యాలు కలిగి ఉంది. దీనిని నగరంలోని సెక్టార్-86 లో ఏర్పాటు చేశారు. ఇది రెండవ అతి పెద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్. జనవరిలో గురుగ్రామ్ లోనే సెక్టార్- 52 లో 100 వాహనాలకు ఒకే సారి ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఒక దానిని నెలకొల్పారు. అలెక్ట్రిఫై ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పథకం కింద కొత్త EV ఛార్జింగ్ స్టేషన్‌ను అభివృద్ధి చేసింది. గురువారం ప్రారంభించిన స్టేషన్‌లో 75 AC, 25 DC, 21 హైబ్రిడ్ ఛార్జింగ్ పాయింట్‌లు ఉన్నాయి. వీటి పూర్తి సామర్ధ్యంలో వినియోగించటం ద్వారా రోజుకు 1,000 కార్లను ఛార్జ్ చేయవచ్చని సంస్థ వెల్లడించింది.

కేవలం నెల వ్యవధిలో తాము నిర్మించిన రెండవ అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అని నేషనల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అభిజీత్ సిన్హ వెల్లడించారు. ఇదే తరహాలో మరో రెండు మెగా ఛార్జింగ్ స్టేషన్లను మరో రెండు నెలల కాలంలో నోయిడాలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆగ్రా- నోయిడా ఈ- హైవే కోసం దీనిని ప్రోటోటైప్ మోడల్ గా అభివృద్ధి చేయటం ద్వారా ఈ- హబ్ ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న కాలంలో అనుమతి పొందిన మూడు నెలల కాలంలో 30 ఈ- హైవే ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అవుతాయని స్పష్టం చేశారు.

Ev Charge Station

కొత్తగా ఏర్పాటు చేసిన స్టేషన్‌లో 1,000 కార్లను, సెక్టార్ 52 స్టేషన్‌లో 576 కార్లను ఛార్జ్ చేసే సామర్థ్యంతో ఈ ఛార్జింగ్ స్టేషన్‌లు ఇప్పుడు 72 శాతం వినియోగం కలిగి ఉన్నయని తెలిపారు. రానున్న 36 నెలల కాలంలో వీటిని బ్రేక్ ఈవెన్‌ లోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం ఈ ఛార్జింగ్ స్టేషన్లు వాణిజ్యపరంగా, సాంకేతికంగా పెట్రోల్ పంపులతో పోటీ పడుతున్నాయని చెప్పారు. ఈ సాధారణ నమూనాలు NHEV ఇ-హైవే స్టేషన్‌లు ప్రపంచ స్థాయి ప్రమాణాలను కలిగి ఉన్నాయని.. భారతీయ రహదారులపై E-మొబిలిటీ యొక్క బలమైన వాణిజ్య రోడ్‌మ్యాప్‌ను రూపొందించగలవని నిరూపించాయని అభిజీత్ సిన్హ పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

SEBI: విదేశీ మార్కెట్లలో పెట్టుబడులను సెబీ నిషేధించిందా.. కొత్త నియమాలు ఏంటంటే..

Insurance Alert: ఇన్సూరెన్స్ కొనేటప్పుడు రైడర్ కూడా తీసుకోవాలా.. రైడర్ వల్ల ఉపయోగం ఏమిటి..