
ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం కీలక అలర్ట్ జారీ చేసింది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈఎస్‌ఐ సౌకర్యం అనేది ఉంటుంది. ఈ సదుపాయం ఉండటం వల్ల ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఆస్పత్రుల్లో వైద్య సేవలతో పాటు నగదు ప్రయోజనాలు వంటివి అందుతాయి. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ దీనిని నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందుకు సహకారం అందిస్తున్నాయి. అయితే ఈఎస్‌ఐ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పనిసరిగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, లేకపోతే ఈఎస్‌ఐ సేవలకు పొందటంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని స్పష్టం చేసింది. అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం.
ఈఎస్ఐ ఉన్న ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలని కేంద్ర కార్మికశాఖ సూచించింది. ఇది పూర్తి చేయడం తప్పనిసరి అని సూచించింది. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని సెక్షన్ 142 ప్రకారం ఈఎస్ఐ సేవలకు ఆథార్ అథెంటికేషన్ తప్పనిసరి అని తెలిపింది. ఈఎస్‌ఐసీ ఐడీకి తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేసుకోవాలని సూచించింది. ఎలాంటి ఆటంకం లేకుండా ఈఎస్ఐ సేవలు పొందాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరి అని, ప్రతీఒక్కరూ కంప్లీట్ చేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి తన ఎక్స్ అకౌంట్‌లో కార్మికశాఖ ఒక పోస్టర్ విడుదల చేసింది. మీ ESIC పెహ్‌చాన్ కార్డుతో మీ ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని పేర్కొంది. ఇది ఎలా చేసుకోవాలనే వివరాలను కూడా పొందుపర్చింది. నకిలీ ఖాతాలను అరికట్టడంతో పాటు నిజమైన లబ్దిదారులకు ప్రయోజనాలు అందించేందుకు ఈ ప్రక్రియను తప్పనిసరి చేశారు. దీంతో ఈఎస్ఐ సౌకర్యం పొందుతున్నవారు తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
-తొలుత esic.gov.in వెబ్ సైట్లోకి వెళ్లాలి
-అనంతరం హోమ్ పేజీలో కనిపించే ఇన్సూర్డ్ పర్సన్స్ అండ్ బెనిఫిషియరీస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి
-యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి
-అనంతరం ఆధార్ సీడింగ్ ఫర్ ఐపీ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి
-ఆ తర్వాత క్లిక్ హియర్ టూ సీడ్ ఆధార్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి
-ఆధార్ నెంటర్ ఎంటర్ చేసి ఓటీపీ ధృవీకరణ పూర్తి చేయాలి
-ఆ తర్వాత రిఫరెన్స్ నెంబర్ అందుతుంది
-వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ ఆధార్ లింక్ అవుతుంది.