EPFO: ఉద్యోగి మరణం తర్వాత భార్య, పిల్లలకు పెన్షన్ వస్తుందా..?

|

Dec 16, 2023 | 9:23 AM

ఉద్యోగి నెలవారీ జీతంలో 12% మొత్తాన్ని బేసిక్ శాలరీతోపాటు, డియర్‌నెస్ అలవెన్స్ (DA) నుంచి కంపెనీ కట్ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలో జమ చేస్తారు. అదనంగా, కంపెనీ తన వంతుగా 12% మొత్తాన్ని జమ చేస్తుంది. దానిలో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS)లోకి మిగిలిన మొత్తం పీఎఫ్‌ ఖాతాలోకి వెళుతుంది. అయితే, పెన్షన్ మొత్తం..

EPFO: ఉద్యోగి మరణం తర్వాత భార్య, పిల్లలకు పెన్షన్ వస్తుందా..?
EPFO
Follow us on

వివిధ కంపెనీల్లోపని చేసే ఉద్యోగులు హఠాత్తుగా మరణించినట్లయితే ఆ కుటుంబ రోడ్డున పడుతుంది. అలాంటి సమయంలో వారికి పీఎఫ్‌ అండగా ఉంటుంది. ఈ పీఎఫ్‌ ద్వారా అతడి భార్య , పిల్లలు పెన్షన్‌కు అర్హులు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఉన్న ఉద్యోగులుకు, వారి కుటుంబాలు వివిధ ప్రయోజనాలను పొందుతాయి. దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇదంతా పెన్షన్లకు సంబంధించిన సంగతి. EPFOలో సభ్యులుగా ఉన్న ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని ప్రతి నెలా PFలో వేస్తారు. ఇది పదవీ విరమణ కోసం మాత్రమే కాకుండా కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. 58 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసిన తర్వాత, ఉద్యోగులు పెన్షన్‌కు అర్హులు. ఉద్యోగి మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులు.. కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతారు. ఈ సదుపాయం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్-95 (EPS-95) కింద అందుతుంది.

ఉద్యోగి నెలవారీ జీతంలో 12% మొత్తాన్ని బేసిక్ శాలరీతోపాటు, డియర్‌నెస్ అలవెన్స్ (DA) నుంచి కంపెనీ కట్ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలో జమ చేస్తారు. అదనంగా, కంపెనీ తన వంతుగా 12% మొత్తాన్ని జమ చేస్తుంది. దానిలో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS)లోకి మిగిలిన మొత్తం పీఎఫ్‌ ఖాతాలోకి వెళుతుంది. అయితే, పెన్షన్ మొత్తం రూ.15,000 ప్రాథమిక జీతం ఆధారంగా లెక్కిస్తారు.

ఈ విధంగా ప్రతి నెలా ఉద్యోగి పెన్షన్ ఖాతాలో 1,250 జమ చేస్తారు. ఉద్యోగి జీతం నుంచి పెన్షన్ మొత్తాన్ని తగ్గించడం కోసం జూలై 11, 2023 వరకు ఆప్షన్ కూడా ఉండేది. పెన్షన్ ఖాతాకు కనీసం 10 సంవత్సరాల పాటు చందా చెల్లించి ఉంటే.. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత జీవితకాల పెన్షన్‌కు అర్హులు అవుతారు. పెన్షన్ మొత్తం ఎంత అనేది ఫార్ములా ను ఉపయోగించి లెక్కిస్తారు. కానీ కనీస పెన్షన్ నెలకు రూ.1,000 ఉంటుంది.

ఇవి కూడా చదవండి

EPS-95 కింద పెన్షన్ సౌకర్యం సభ్యునికి మాత్రమే కాకుండా ఉద్యోగి పదవీ విరమణకు ముందు లేదా తర్వాత మరణించిన సందర్భంలో జీవిత భాగస్వామి , పిల్లలకు కూడా వర్తిస్తుంది. ఈ పథకం కింద కుటుంబ సభ్యులు ఎప్పుడు ఏ రకమైన పెన్షన్‌ని పొందుతారో తెలుసుకుందాం.

EPS కింద ఉద్యోగ సమయంలో ఉద్యోగి మరణించినట్లయితే.. జీవిత భాగస్వామి నెలవారీ వితంతు పెన్షన్‌కు అర్హులు. ఇది ఉద్యోగి పెన్షన్‌లో 50%. అయితే, కనీస మొత్తం రూ.1,000. ఉద్యోగిపై ఆధారపడిన పిల్లలు ఉన్నట్లయితే వారు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పెన్షన్‌కు అర్హులు. పిల్లలు ఒక్కొక్కరు వితంతు పెన్షన్‌లో 25% పొందుతారు. వితంతువు తన జీవితాంతం ఈ ప్రయోజనాన్ని పొందుతూనే ఉంటుంది. అయితే పిల్లలు 25 సంవత్సరాల వయస్సు వరకు అందుకుంటారు. వితంతువు పునర్వివాహం చేసుకుంటే ఈ ప్రయోజనం నిలిచిపోతుంది. ప్రస్తుతం మదన్ కుటుంబానికి రూ. 1,500 పెన్షన్‌గా అందుకుంటోంది.

ఉద్యోగి మరణించిన తర్వాత అతని భార్య కూడా మరణించినట్లయితే, పిల్లలు పెన్షన్‌కు అర్హులు. ఆర్ఫాన్ పెన్షన్ పథకం కింద, వితంతు పింఛను. పెన్షన్ మొత్తంలో 75% ఉంటుంది. ఈ ప్రయోజనం ఇద్దరు పిల్లలకు కలుగుతుంది. పింఛను కోసం ఒక చిన్నారికి కనీస మొత్తం రూ.750. ఈ ప్రయోజనం ఇద్దరు పిల్లలకు.. అంటే వారికి 25 సంవత్సరాల వయసు వరకు పొడిగించబడుతుంది. అయితే అందులో ఎవరైనా దివ్యాంగులుంటే.. వారు తమ జీవితాంతం ఈ పెన్షన్‌ని అందుకుంటారు.

ఒక ఉద్యోగి ఇంకా వివాహం చేసుకోకపోతే కొన్ని కారణాల వల్ల ఉద్యోగ సమయంలో మరణించినట్లయితే కుటుంబ పెన్షన్‌ ప్రయోజనాన్ని ఉద్యోగి తండ్రికి ఇస్తారు. తండ్రి లేనప్పుడు, ఉద్యోగి తల్లికి ఆమె జీవితాంతం ఈ ప్రయోజనం అందిస్తారు. కనీస పెన్షన్ మొత్తం రూ. 1,000.

EPS కుటుంబ పెన్షన్‌ ప్రయోజనాన్ని పొందడానికి ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, లబ్ధిదారుని ఆధార్ కార్డ్, పిల్లల బ్యాంక్ ఖాతాల వివరాలు , పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. అయితే పత్రాలు భర్త మరణించిన సమయంలో ఏ కంపెనీలో పని చేస్తున్నాడో ఆ కంపెనీ హెచ్‌ఆర్ విభాగానికి లేదా EPFO ప్రాంతీయ కార్యాలయం ద్వారా సమర్పించాలి. EPS నిర్వచనం ప్రకారం.. కుటుంబ సభ్యులలో తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు పిల్లలు ఉంటారు. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలను కూడా కుటుంబంలో భాగంగా పరిగణిస్తారు. ఎవరైనా EPSలో నామినేట్ చేసినా అది చెల్లనిదిగానే చూస్తారు. జీవిత భాగస్వాములు, పిల్లలను కుటుంబ పెన్షన్ కు లబ్ధిదారులుగానే పరిగణిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి