
ఈపీఎఫ్ఓ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై వాట్సాప్‌లోనే PF సేవలను అందించనుంది. ప్రస్తుతం ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్‌వో వెబ్ సైట్ ద్వారా పీఎఫ్ ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వాట్సప్ సేవలను ఇప్పటివరకు అందుబాటులో లేవు. ఇక నుంచి పీఎఫ్ ఖాతాదారులు సులభంగా వాట్సప్ నుంచే సేవలు పొందవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా చందాదారులు సేవలు పొందవచ్చని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఏఐ చాట్‌బాట్ సేవలు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. వాట్సాప్‌లో ‘Hello’ అని మెసేజ్ చేస్తే చేయడం ద్వారా పీఎఫ్ సేవలు ఈజీగా సెకన్లలోనే పొందే సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్, చివరి 5 లావాదేవీల వివరాలు అన్నీ వాట్సప్ ద్వారా పొందవచ్చు.
అంతేకాకుండా వాట్సప్ పీఎఫ్ సేవల్లో అనేక ఫీచర్లు ఉన్నాయి. స్థానిక భాషల్లోనూ మెనూ ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చారు. దీంతో సామాన్యులకు మరింత చేరువగా EPFO సేవలు అందనున్నాయి. పెండింగ్ కేసులు, ఆధార్ సంబంధిత సమస్యలకు వాట్సాప్‌లోనే వెంటనే పరిష్కారం లభించనుంది. తక్కువ సమయంలోనే సేవల విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఈపీఎఫ్‌వో.. టెక్నాలజీ దిశగా ఈ కీలక అడుగు వేసిందని చెప్పవచ్చు. ఒక నెలలోగా ఈ వాట్సప్ సేవలను ప్రారంభించనుంది. సభ్యులకు సేవలను మెరుగుపర్చడం, ఈపీఎఫ్‌వో కార్యాలయాలపై ఒత్తిడిని తగ్గించడం, కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడం, కాల్ సెంటర్లపై ఆధారపడకుండా చేయడంలో భాగంగా వాట్సప్ సేవలను తీసుకొస్తున్నారు. ఇండియాలో వాట్సప్‌కు ఆదరణ పెరుగుతోంది. దీంతో వాట్సప్ ద్వారా వేగవంతంగా, సులువుగా ఖాతాదారులకు సేవలు అందించవచ్చు. ఈ కారణంతో ఈపీఎఫ్ఓ వాట్సప్ సేవలను తీసుకొస్తుంది. ఏఐ ఆధారిత చాట్ బాట్‌ల ద్వారా ఇది పనిచేస్తుంది. దీంతో మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా సేవలు పొందవచ్చు. సాధారణ ప్రశ్నలను ఈ చాట్ బాట్ సులువుగా పరిష్కరిస్తుంది. ఇక అకౌంట్‌కు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. బ్యాలెన్స్ చెకింగ్, చివరి ఐదు లావాదేవీలు, క్లెయిమ్స్ స్టేటస్ వంటి సేవలు వాట్సప్ నుంచే పొందవచ్చు.
-యూఏఎన్‌తో లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఈపీఎఫ్‌వో తీసుకొస్తున్న ఏఐ చాట్ బాట్ నెంటర్‌కు హాయ్ అని మెస్సేజ్ పెట్టాలి
-ఆ తర్వాత ఈపీఎఫ్‌వో మీ మొబైల్ నెంబర్‌ను ధృవీకరిస్తుంది
-అనంతరం మెనూ ఆప్షన్ వస్తుంది
-ఏ భాషలో సర్వీసులు కావాలనుకుంటున్నారనేది ఎంచుకోవాలి
-ఆ తర్వాత బ్యాలెన్స్ చెకింగ్, గత 5 కాంట్రిబ్యూషన్స్, ఈపీఎఫ్‌వో క్లెయిమ్స్ స్టేటస్, కంప్లైంట్ వంటి ఆప్షన్లను ఎంచుకోవాలి