Uan Number
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికీ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను జారీ చేస్తుంది. ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్ పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా యూఏఎన్ నెంబర్ మాత్రం ఒక్కటే ఉంటుంది. అయితే ఈఫీఎఫ్‌వో కొత్త ధ్రువీకరణ ఐడీని కేటాయిస్తుంది. ఇది ఒరిజినల్ యూఏఎన్‌తో లింక్ అవుతుంది. అయితే ఈపీఎఫ్‌వో సేవలను పొందడానికి యూఎన్‌ఏ నెంబర్‌తో కేవైసీ వివరాలు లింక్ చేయాల్సి ఉంటుంది. యూఏఎన్ నెంబర్ మర్చిపోతే ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి సమయంలో ఉద్యోగులు ఎలాంటి టెన్షన్ పడనవసరం లేదు.
పిన్ మర్చిపోతే తిరిగి పొందడం ఎలా..?
- అధికారిక వెబ్ సైట్ ఈపీఎఫ్‌లో పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. హోమ్ పేజీలో ఉన్న నో యు యుఏఎన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- మెంబర్ ఐడీ ఐడీ, రాష్ట్రం, రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మెంబర్ ఐడీ శాలరీ స్లిప్‌లో ఉంటుంది.
- గెట్ ఆథరైజేషన్ పిన్‌పై క్లిక్ చేయాలి.
- పీఎఫ్ మెంబర్ ఐడీతో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌కు ఒక పిన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి.
- వాలిడేట్ ఓటీపీ అండ్ గెట్ యూఏఎన్‌పై క్లిక్ చేయాలి.
- యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) మీ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.
UAN లేకుండా PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి..
- ఈపీఎఫ్ఓ హోమ్ పేజీ epfindia.gov.in లాగిన్ అవ్వండి
- మీ ఈపిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ‘క్లిక్ హియర్ టు నో యువర్ పీఎఫ్ బ్యాలెన్స్’ పై క్లిక్ చేయండి.
- వెంటనే epfoservices.in/epfo/ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ‘మెంబర్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్’ను ఎంచుకోండి.
- అక్కడ మీ రాష్ట్రం, ఈపీఎఫ్ కార్యాలయం, కోడ్, పీఎఫ్ ఖాతా సంఖ్య, ఇతర వివరాలను నమోదు చేయండి.
- సబ్మిట్’ చేసే ముందు ఐ అగ్రీ’పై క్లిక్ చేయండి.
- అప్పుడు మీ స్క్రీన్‌పై ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ప్రత్యక్షమవుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి