AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈపీఎఫ్‌వోలో ఈ ఐదు కీలక మార్పుల గురించి మీకు తెలుసా..?

ఇప్పుడు EPFOలో మీ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయడం చాలా సులభం అయింది. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధార్‌తో లింక్ చేయబడి ఉంటే, మీరు మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తల్లిదండ్రుల పేరు, వైవాహిక స్థితి, జీవిత..

EPFO: ఈపీఎఫ్‌వోలో ఈ ఐదు కీలక మార్పుల గురించి మీకు తెలుసా..?
EPFO 3.0 అమలుతో ఈపీఎఫ్‌వో ​​కింద ఉన్న ఉద్యోగులు ఉపశమనం పొందవచ్చు. ఈ అప్‌గ్రేడ్ పీఎఫ్‌ ఉపసంహరణ, కేవైసీ అప్‌డేట్‌లు, క్లెయిమ్‌ల వంటి ప్రక్రియలను సులభతరం చేస్తుంది. ముఖ్యంగా పీఎఫ్‌ నిధులను ఉపసంహరించుకోవడానికి ఏటీఎం లాంటి కార్డులను త్వరలో ఉపయోగించవచ్చు.
Subhash Goud
|

Updated on: May 19, 2025 | 9:14 AM

Share

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2025 సంవత్సరంలో తన సభ్యుల కోసం అనేక ప్రధాన మార్పులను చేసింది. ఇది ప్రక్రియలను సులభతరం, డిజిటల్, పారదర్శకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పులు ఉద్యోగులకు మాత్రమే అనుకూలమైనవి కావు. కానీ అది వారి పొదుపు, పెన్షన్ సంబంధిత విషయాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ ఐదు ప్రధాన మార్పులను మనం అర్థం చేసుకుందాం.

మీ ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేయడం సులభతరం:

ఇప్పుడు EPFOలో మీ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయడం చాలా సులభం అయింది. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధార్‌తో లింక్ చేయబడి ఉంటే, మీరు మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తల్లిదండ్రుల పేరు, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగ ప్రారంభ తేదీ వంటి వివరాలను ఎటువంటి పత్రం లేకుండా ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయవచ్చు. అయితే, అక్టోబర్ 1, 2017 కి ముందు UAN సృష్టించబడిన వారు, కొన్ని సందర్భాల్లో కంపెనీ నుండి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ఈ మార్పు ఉద్యోగుల సమయం, శ్రమను ఆదా చేయడంలో సహాయపడుతుంది.

పీఎఫ్ బదిలీ ప్రక్రియ వేగవంతం:

గతంలో ఉద్యోగాలు మారేటప్పుడు పీఎఫ్‌ బదిలీ చేయడం సంక్లిష్టమైన, సమయం తీసుకునే ప్రక్రియ. దీనికి కంపెనీ ఆమోదం అవసరం. కానీ జనవరి 15, 2025 నుండి EPFO దానిని సులభతరం చేసింది. ఇప్పుడు చాలా సందర్భాలలో పాత లేదా కొత్త కంపెనీ ఆమోదం అవసరం ఉండదు. మీ UAN ఆధార్‌తో లింక్ చేయబడి, వివరాలు (పేరు, పుట్టిన తేదీ, లింగం) సరిపోలితే, పీఎఫ్‌ బదిలీ వేగంగా జరుగుతుంది. ఇది మీ పొదుపు నిర్వహణ, కొనసాగింపును నిర్ధారిస్తుంది.

కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ (CPPS):

జనవరి 1, 2025 నుండి EPFO కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించింది. ఇప్పుడు పెన్షన్ NPCI ప్లాట్‌ఫామ్ ద్వారా నేరుగా ఏదైనా బ్యాంకు ఖాతాకు పంపబడుతుంది. గతంలో పెన్షన్ చెల్లింపు కోసం పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (PPO)ని ఒక ప్రాంతీయ కార్యాలయం నుండి మరొక ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేయాల్సి వచ్చేది. దీని వలన ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఈ ప్రక్రియ ముగిసింది. అలాగే, పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సులభంగా సమర్పించగలిగేలా కొత్త PPOని UANతో లింక్ చేయడం తప్పనిసరి.

అధిక జీతంపై పెన్షన్ కోసం స్పష్టమైన నియమాలు:

అధిక జీతం ఆధారంగా పెన్షన్ తీసుకోవాలనుకునే ఉద్యోగుల కోసం పెన్షన్ నియమాలను EPFO ​​స్పష్టం చేసింది. ఇప్పుడు అందరికీ ఒకే ప్రక్రియ అనుసరించబడుతుంది. ఉద్యోగి జీతం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి, అతను అదనపు సహకారాలు చెల్లిస్తే అతను అధిక జీతంతో పెన్షన్ పొందవచ్చు. ప్రైవేట్ ట్రస్టులను నడుపుతున్న కంపెనీలు కూడా EPFO నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ నియమం పెన్షన్ మొత్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

సరళీకృత ఉమ్మడి ప్రకటన ప్రక్రియ:

జనవరి 16, 2025న జాయింట్ డిక్లరేషన్ (JD) ప్రక్రియను సులభతరం చేయడానికి EPFO కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పుడు తప్పు లేదా అసంపూర్ణ సమాచారాన్ని సరిదిద్దడం సులభం అవుతుంది. క్లెయిమ్‌ల ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా ఉంటుంది. ఈ మార్పులు ఉద్యోగులు, పెన్షనర్లకు EPFO సేవలను మరింత మెరుగుపరుస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి