
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. పీఎప్ వడ్డీ జమ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే చాలామంది ఖాతాల్లోకి వడ్డీ నగదు వచ్చేసింది. జూలై 15 లోపు అందరి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. గత ఆర్ధిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ ప్రకటించింది. ఇప్పుడు దాని ప్రకారం జమ చేస్తోంది. సుమారు రూ.1.44 లక్షల కోట్లకు పైగా వార్షిక వడ్డీని ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేసి, ఆ తర్వాత ఫీల్డ్ అథారిటీలచే ధృవీకరించి సభ్యుల ఖాతాలకు పీఎఫ్ సంస్థ జమ చేస్తోంది. అయితే మీకు వడ్డీ పడిందా.. లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం.
-https://passbook.epfindia.gov.in/MemberPassBook/login
-UAN నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఉపయోగించి సైన్ ఇన్ చేయండి
-మీ ఆధార్ లింక్డ్ ఫోన్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.
-సంబంధిత కంపెనీ IDని ఎంచుకోండి.
-“పాస్‌బుక్‌ను వీక్షించండి” పై క్లిక్ చేయండి
-పాస్‌బుక్‌లో దిగువన మీరు పీఎఫ్ వడ్డీ ఎంత పడిందనేది చెక్ చేసుకోవచ్చు
-గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
-ఆ తర్వాత యాప్‌ను తెరిచి సెర్చ్‌లో EPFO అని సెర్చ్ చేయండి
-ఈపీఎఫ్‌వో సేవలను ఎంచుకోండి
-అనంతరం పాస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
-UAN నెంబర్ ఎంటర్ చేసి మొబైల్‌కు పంపిన OTPని నమోదు చేసింది
-అనంతరం యజమాని ఖాతాను ఎంచుకోండి
-అక్కడ పీఎఫ్ బ్యాలెన్స్‌లో వడ్డీని చెక్ చేసుకోవచ్చు
-మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి
-రెండు రింగుల తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది.
-మీ PF వివరాలు (మెంబర్ ఐడి, చివరి కాంట్రిబ్యూషన్ మరియు మొత్తం బ్యాలెన్స్) ఉన్న ఒక SMS మీకు వస్తుంది