AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: దసరా పండక్కి ముందే అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త.. చెక్ చేస్కోండి..

ఈపీఎఫ్‌వో కీలక ప్రకటన చేసింది. గత నెలకు సంబంధించి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ జమ చేయడానికి కంపెనీలకు డెడ్ లైన్ విధించింది. ప్రతీ నెలా ఉద్యోగి జీతం నుంచి కట్ చేసే సొమ్మను తర్వాతి నెలలో యాజమాన్యాలు పీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.

EPFO: దసరా పండక్కి ముందే అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త.. చెక్ చేస్కోండి..
Epfo
Venkatrao Lella
|

Updated on: Oct 12, 2026 | 12:02 PM

Share

సెప్టెంబర్ నెలకు సంబంధించిన పీఎఫ్ డబ్బులు మీ అకౌంట్లో ఇంకా పడలేదని ఆందోళన చెందుతున్నారా..? నో టెన్షన్.. మరో మూడ్రోజుల్లో జమయ్యే అవకాశముంది. ఈ మేరకు కంపెనీలకు ఈపీఎఫ్‌వో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీలోపు సెప్టెంబర్ నెలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్లు జమ చేయాలని ఆదేశించింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఈపీఎఫ్ఓ తన ఎక్స్ అకౌంట్లో ఒక పోస్ట్ చేసింది. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం యజమానులు ప్రతీ నెలా 15వ తేదీలోపు ముందు నెలకు సంబంధించిన చందాను ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోగా క్రెడిట్ చేయకపోతే కంపెనీలకు, ఆలస్యమైన సమాయానికి వడ్డీ వంటివి విధించే అవకాశముంది. ఆలస్యమైతే ఉద్యోగి ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు కూడా చేయవచ్చు.

అక్టోబర్ 20వ తేదీన దసరా పండుగ వస్తున్న క్రమంలో తమ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ తెలిపింది. అక్టోబర్ 15లోగా కంపెనీలు ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో కాంట్రిబ్యూషన్ జమ చేయాలని ఆదేశించింది.  ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. “యజమానులకు ముఖ్య గమనిక.. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ECRను ఫైల్ చేసి చెల్లింపులను అక్టోబర్ 15, 2026 లోగా జమ చేయండి. ECRను సకాలంలో ఫైల్ చేసి నిబంధనలు పాటించండి. ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేయండి” అంటూ ఈపీఎఫ్ఓ తన ఎక్స్‌లో తెలిపింది.

ఈసీఆర్ అంటే ఏమిటి..?

యజమానులు ఈసీఆర్(ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్) ప్రక్రియ ద్వారా ఉద్యోగులకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఉద్యోగుల జీతాలు, నెలవారీ కాంట్రిబ్యూషన్ వివరాలు ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ ద్వారా దీనిని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి శాలరీ, పీఎఫ్ కాంట్రిబ్యూషన్ వివరాలను కంపెనీలు ఈపీఎఫ్‌కు సమర్పించాలి. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ ఉద్యోగి ఖాతాలో నిధులు జమ చేస్తుంది. ఒకవేళ కంపెనీ ఆలస్యం చేస్తే ఈపీఎఫ్ఓ చట్టంలోని సెక్షన్ 7Q ప్రకారం చెల్లించని మొత్తంపై ఏడాదికి 12 శాతం చొప్పున వడ్డీని చెల్లించాల్సి రావొచ్చు. అలాగే బకాయిపై 5 నుంచి 25 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. త్వరలో దసరా పండుగ వస్తుండటంతో ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్ కాంట్రిబ్యూషన్ జమ అయ్యేలా చేయడంలో భాగంగా ఈపీఎఫ్ఓ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ యజమాని నిర్ణీత సమయంలోగా జమ చేయకపోతే ఉద్యోగులు ఫిర్యాదు చేయవచ్చు. తొలుత హెచ్‌ఆర్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. సమస్య పరిష్కారం కాకపోతే ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేయవచ్చు. దీంతో పీఎఫ్ సంస్థ మీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది.

Follow Us