EPFO Nominee: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ చందాదారుల కోసం అనేక ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిన కారణంగా చిన్న చిన్న అవసరాల కోసం ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ-నామినేషన్ సర్వీస్ అనేది ఆన్‌లైన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు పీఎఫ్ ఖాతా ఉంటే అందులో నామిని పేరును నమోదు చేయాలి. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చే డబ్బులు రావు. అయితే ఈపీఎఫ్ నామినీని మార్చడానికి పీఎఫ్ సభ్యులు కొత్త నామినేషన్ దాఖలు చేయవచ్చని ఈపీఎఫ్‌ఓ ట్వీట్ చేసింది.
తాజాగా పీఎఫ్ అకౌంట్లో నామినీ పేరును ఫైనల్‌గా పరిగణిస్తారు. అయితే ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత కల్పిస్తోంది ఈపీఎఫ్‌వో. ఇందులో ప్రతి నెల జమ అయ్యే మొత్తం భవిష్యత్తలో వివాహాలకు, ఇంటి నిర్మాణం, ఇతర ముఖ్యమైన అవసరాలకు ఎంతోగానో ఉపయోగపడనుంది. ఇక పెన్షన్ పథకం, బీమా సౌకర్యం ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులకు భరోసాగా ఉంటుంది. అయితే వీటన్నింటిని పీఎఫ్ చందాదారుడు నామినీని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. చందదారులు నామినీని సులభంగా యాడ్ చేసుకనే సదుపాయాన్ని కల్పిస్తోంది ఈపీఎఫ్‌ఓ. ఆన్‌లైన్‌లో వివరాలన్ని సమర్పించాల్సి ఉంటుందని ఈపీఎఫ్‌ఓ కోరుతోంది.
ఆన్‌లైన్‌లో నామినీని వివరాలు నమోదు చేయడం ఎలా..?
► ముందుగా ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్ (epfindia.gov.in)ను ఓపెన్ చేయాలి.
► సర్వీస్ కేటగిరిలో ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
► ఆ తర్వాత Member UAN/Online Service (OCS/OTCP) అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
► యూఏఎన్, పాస్‌వర్డ్‌తో వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.
► అందులో మేనేజ్ కేటగిరిలోని ఈ-నామినేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
► అక్కడ ‘మేనేజ్’ విభాగంలోని ‘ఈ-నామినేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
► ఆ తర్వాత యస్ అని క్లిక్ చేసి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయవచ్చు.
► యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ద్వారా నిమినీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
► సేవ్ నామినేషన్‌పై క్లిక్ చేశాక మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి: