EPFO: పీఎఫ్ ఖాతాదారులకు కొత్త రూల్స్.. మారిన విత్ డ్రా నిబంధనలు..కీలక మార్పులు ఇవే..

ఈపీఎఫ్ఓ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి కదరదు. 25 శాతం కనీస బ్యాలెన్స్ ఖాతాలో ఉంచాలి. మిగతా 75 శాతం సొమ్మును వివిధ కారణాలతో ఉపసంహరించుకోవచ్చు. ఈ మేరకు కేంద్రం నిబంధనలు తెచ్చింది.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు కొత్త రూల్స్.. మారిన విత్ డ్రా నిబంధనలు..కీలక మార్పులు ఇవే..
Epfo Update

Updated on: Jul 20, 2026 | 3:42 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాదారులకు బిగ్ అలర్ట్. పీఎఫ్ విత్ డ్రాలకు సంబంధించి ఇటీవల కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. ఇక నుంచి మీరు 75 శాతం నగదును మాత్రమే ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోగలరు. 25 శాతం నగదును ఖచ్చితంగా పీఎఫ్ అకౌంట్లో ఉంచాల్సి ఉంటుంది. ఈ మేరకు నిబంధనల్లో ఈపీఎఫ్ఓ కీలక మార్పులు చేసింది. కొత్త నిబంధన ప్రకారం.. ఒక ఉద్యోగి ఉద్యోగంలో ఉండగానే పీఎఫ్ ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే.. కనీసం 25 శాతం బ్యాలెన్స్ ఉంచాలి. మిగతా 75 శాతం అమౌంట్‌ను వివిధ కారణాలతో విత్ డ్రా చేసుకోవచ్చు. చాలామంది ఉద్యోగ సమయంలో తరచుగా డబ్బు విత్‌డ్రా చేస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో పొదుపు అనేది ఉండటం లేదు. ఉద్యోగుల పదవీ విరమణ పొదుపును పరిరక్షించేందుకు ప్రభుత్వం ఈ రూల్ తీసుకొచ్చింది.

ఇందులో రెండు విధానాలు ఉన్నాయి. కనీస నిల్వ అంటే ఉద్యోగి, కంపెనీ ఇద్దరి వాటాలతో పాటు వడ్డీతో సహా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తం సొమ్ములో 25 శాతం కనీస బ్యాలెన్స్‌గా ఉంచుకోవాలి. రెండవది అర్హత గల సభ్యుని నిల్వ. 25 శాతం పక్కన పెట్టిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఉద్యోగి అవసరమైతే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఉద్యోగి తన పీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షలు జమ చేసుకుంటే.. ఈ నిల్వలో రూ.2.5 లక్షలు తప్పనిసరి ఉంచాలి. వివిధ కారణాలతో ఉద్యోగి గరిష్టంగా రూ.7.5 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నప్పుడు పాక్షిక విత్‌డ్రాయల్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకవేళ ఉద్యోగి పదవీ విరమణ చేసినా లేదా ఒక నిర్దిష్ట వయస్సుకు చేరుకున్నా, శాశ్వతంగా అంగవైకల్యం వచ్చినా లేదా పూర్తి EPF విత్‌డ్రాయల్ అనుమతించబడిన మరే ఇతర సందర్భంలోనైనా మొత్తం బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోగలరు. అటువంటి సందర్భాల్లో 25% బ్యాలెన్స్ కీన నిబంధన వర్తించదు.

అటు కేంద్రం కొత్త ఈపీఎఫ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో డబ్బు విత్‌డ్రా చేసుకునే ప్రక్రియను సులభతరం చేశారు. గతంలో వివిధ అవసరాలకు వివిధ నియమాలు వర్తించేవి. కానీ ఇప్పుడు వైద్య చికిత్స, పిల్లల విద్య, వివాహం, ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం వంటి అవసరాల కోసం విత్‌డ్రా నియమాలను మార్చారు. ఉద్యోగులు కొన్ని ప్రమాణాలను నెరవేర్చిన తర్వాత ఈ ప్రయోజనాల కోసం తమ బ్యాలెన్స్ నుండి నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మార్పు దీర్ఘకాలంలో ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల పదవీ విరమణ సమయంలో వారికి తగినంత పొదుపు ఉంటుంది. అలాగే బ్యాలెన్స్‌పై వడ్డీని కూడా పొందుతూనే ఉంటారని ఇది నిర్ధారిస్తుంది

Follow Us