EPFO: పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుందో సింపుల్‌గా ఇలా తెలుసుకోండి..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త. ఈపీఎఫ్ఓ వార్షిక వడ్డీని జమ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. ఇప్పటికే చాలామంది ఖాతాల్లో డబ్బులు జమ అవ్వగా.. 15 రోజుల్లోగా అందరి ఖాతాల్లో పడనున్నాయి. గత ఆర్ధిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ అందించాలని నిర్ణయించారు.

EPFO: పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుందో సింపుల్‌గా ఇలా తెలుసుకోండి..
Epfo

Updated on: Jul 07, 2026 | 7:05 PM

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ ఖాతాదారులకు వడ్డీని జమ చేస్తోంది. ఈ మేరకు వెంటనే క్రెడిట్ చేయాలని అన్ని ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది పీఎఫ్ చందాదారులు బెనిఫిట్ పొందునున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే వడ్డీని విడుదల చేయాలని EPFO ​ప్రాంతీయ ఆఫీసులను ఆదేశిస్తూ ​అధికారికంగా సర్క్యులర్‌ జారీ చేసింది.

ఈపీఎఫ్ఓ వడ్డీ ఎలా లెక్కిస్తారు..?

2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ అందించాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించింది. అయితే ఉద్యోగులు, యజమానులు ఇద్దరూ చేసిన చెల్లింపులపై వడ్డీని లెక్కిస్తారు. ప్రతీ నెలా మీ వాటాతో పాటు యజమాని వాటా పీఎఫ్ అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది. దీంతో మీ పీఎఫ్ ఖాతాలోని నెలవారీ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. మీరు డబ్బులు విత్ డ్రా చేసుకుంటే.. అప్పటివరకు నెలవవారీగా లెక్కించి వడ్డీ జమ చేస్తారు. డబ్బులు విత్ డ్రా చేసుకుంటే.. అనంతరం అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ లెక్కిస్తారు. మీకు వడ్డీ ఎంత వస్తుందనేది మీ EPF ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ రూ. 5 లక్షలు ఉంటే 8.25 శాతం వార్షిక వడ్డీ ప్రకారం రూ. 41,250 అందుతాయి. ఇక 10 రూ. 10 లక్షల బ్యాలెన్స్ ఉంటే రూ. 82,500 వస్తుంది. జమ చేయబడిన వడ్డీని ప్రస్తుత బ్యాలెన్స్‌కు జోడిస్తారు. దీంతో కాంపౌండింగ్ ద్వారా పదవీ విరమణ సమయంలో మీ డబ్బులు పెరుగుతాయి.

పీఎఫ్ వడ్డీ ఎలా చెక్ చేసుకోవాలి..?

EPFO ​​పోర్టల్, UMANG యాప్, EPFO ​​పాస్‌బుక్ సర్వీసు, మిస్డ్ కాల్, SMS సౌకర్యం ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పీఎఫ్ వెబ్ సైట్, మిస్డ్ కాల్, ఎస్‌ఎంఎస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. డేటాబస్ అనుసంధానం, సిస్టమ్ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా ఉమాంగ్ యాప్‌లో పీఎఫ్ సర్వీసులు నిలిచిపోయాయి. త్వరలోనే ఉమాంగ్ యాప్‌లో కూడా పీఎఫ్ ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని వల్ల సింపుల్‌గా పీఎఫ్ బ్యాలెన్స్ యాక్సెస్, పాసు బుక్, యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ వంటి సేవలు సులువుగా పొందవచ్చు. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం ఉన్న పోర్టల్‌లో మార్పులు చేస్తోంది. మరింత వేగంగా సేవలు అందించేలా సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తోంది. అలాగే కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. జూన్ 26న ప్రారంభమైన ప్రక్రియ జులై 3న ముగిసింది. దీంతో జులై 3 నుంచి పీఎఫ్ పోర్టల్ పనిచేస్తుంది.

Follow Us