EPFO: ఒక చిన్న మిస్‌ కాల్‌తో మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..

|

Nov 30, 2022 | 7:09 AM

ఉద్యోగి నెలవారి బేసిక్‌ శాలరీలో 12 శాతాన్ని పీఎఫ్‌ ఖాతాకు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారనే విషయం తెలిసిందే. ఉద్యోగి పనిచేసే సంస్థ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంటారు. అయితే కొన్ని కంపెనీలు రెండింటినీ ఉద్యోగుల జీతాల నుంచి చెల్లిస్తుంటాయి. ఇదిలా ఉంటే పీఎఫ్‌ ఖాతాలో ఎంత బ్యాలెన్స్‌ ఉందన్న...

EPFO: ఒక చిన్న మిస్‌ కాల్‌తో మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..
Epfo
Follow us on

ఉద్యోగి నెలవారి బేసిక్‌ శాలరీలో 12 శాతాన్ని పీఎఫ్‌ ఖాతాకు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారనే విషయం తెలిసిందే. ఉద్యోగి పనిచేసే సంస్థ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంటారు. అయితే కొన్ని కంపెనీలు రెండింటినీ ఉద్యోగుల జీతాల నుంచి చెల్లిస్తుంటాయి. ఇదిలా ఉంటే పీఎఫ్‌ ఖాతాలో ఎంత బ్యాలెన్స్‌ ఉందన్న విషయం తెలుసుకోవాలను అందరూ కోరుకుంటారు. అత్యవసారికి పీఎఫ్‌ అమౌంట్‌ తీసుకోవడం లేదా ఉన్న అమౌంట్‌పై లోన్‌ తీసుకోవాలనే ప్లాన్‌లో ఉంటారు.

అయితే పీఎఫ్‌ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్‌ ఉందన్న విషయాన్ని తెలుసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయన్న విషం తెలిసిందే. ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అకౌంట్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం సమయంతో కూడుకున్న పని. అయితే ఒక చిన్న మిస్డ్‌ కాల్‌ లేదా ఎస్‌ఎమ్‌ఎస్‌ సహాయంతో మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఎంతుందో తెలుసుకోవచ్చని మీకు తెలుసా.? ఇందుకోసం ఏం చేయాలంటే..

ఎస్‌ఎమ్ఎస్ ద్వారా ఇలా తెలుసుకోవచ్చు..

* ఇందుకోసం ముందుగా మీ మొబైల్‌ నెంబర్‌ మీ యూనివర్సిల్‌ అకౌంట్‌ నెంబర్‌ (UAN)కు లింక్‌ చేసి ఉండాలి. అంతేకాకుండా UAN ఆధార్‌, పాన్‌, బ్యాంక్‌ ఖాతాకు కచ్చితంగా లింక్‌ అయి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* తర్వాత మీ మొబైల్‌ నుంచి ‘EPFOHO UAN ENG’ అని టైప్‌ చేసి 7738299899 నెంబర్‌కు మెసేజ్‌ చేయాలి. పైన తెలిపిన మెసేజ్‌లో చివరి మూడు లెటర్స్‌ మీ స్థానిక భాషను సూచిస్తుంది.

* దీంతో వెంటనే మీ పీఎఫ్‌ ఖాతాలో ఎంత బ్యాలెన్స్‌ ఉందన్న సమాచారం మొబైల్‌కు మెసేజ్‌ రూపంలో వస్తుంది.

మిస్‌ కాల్‌ ద్వారా ..

మీ UAN రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి 01122901406 నెంబర్‌కు మిస్‌ కాల్ ఇవ్వాలి. దీంతో వెంటనే మీ ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..