ప్రపంచ వ్యాప్తంగా భారతీయులందరూ ఉత్సాహంగా జరుపుకోనే పండగ హోలీ. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో సందడిగా పండగ వేడుకలలో పాల్గొంటారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ డ్యాన్సులు చేస్తారు. విదేశాల్లో ఉండే చాలామంది హోలీ పండగ సందర్భంగా సొంత ఊళ్లకు వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి వారి కోసం దుబాయ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణ సమయంలోనూ పండగ జోష్ ను నింపుతూ గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఇండియాకు రాకముందే హోలీ అనుభవాన్ని పొందారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమిరేట్స్ సర్వీస్ ను కొనియాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
దుబాయ్ లోని ఎమిరైట్ ఎయిర్ లైన్స్ విమానాల్లో మార్చి 24, 25 తేదీల్లో భారత దేశానికి ప్రయాణమైన వారికి ప్రత్యేక ఆతిథ్యం, విందు, వినోదాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రయాణికులకు హోలీ పండగ అనుభూతిని కల్పించింది. అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్‌కతాకు వెళ్లే ప్రయాణికులకు భారతీయ సంప్రదాయ స్వీట్లతో విందు ఇచ్చింది. ఇందులో కేసర్ గుజియా, ప్రత్యేకంగా పాలు, డ్రై ఫ్రూట్స్ తయారుచేసిన వంటకాలు ఉన్నాయి. ఫస్ట్, బిజినెస్ క్లాస్ ప్రయాణీకులందరికీ చల్లని తండైతో పానీయంలో సాదర స్వాగతం పలికింది. ఇది పాలు, గింజలు, గులాబీ రేకులు, కుంకుమపువ్వుతో తయారు చేయబడిన ఒక రిఫ్రెష్ డ్రింక్. ఈ ఏర్పాట్ల ద్వారా భారతీయ ప్రయాణికులకు పండగ ఉత్సాహం పెంచేలా చేసింది.
ప్రయాణికులకు ప్రత్యేక పానీయాలు, ఆహార పదార్థాలతో విందు అందజేయడంతో పాటు వినోదానికి కూడా ఏర్పాటు చేసింది. హోలీ పండగ ఉత్సాహాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంది. ప్రయాణంలో వీక్షించడానికి 260 వరకూ ప్రముఖ భారతీయ సినిమాలు అందుబాటులో ఉంచింది. బాలీవుడ్ క్లాసిక్ నుంచి తాజా చిత్రాలతో పాటు ప్రాంతీయ చిత్రాలు కూడా ఉన్నాయి. అలాగే యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి మ్యూజిక్ వీడియోలను అదనంగా చూడవచ్చు. ఇవన్నీ మీ ప్రయాణంలో మధురానుభూతిని కలిగించాయి.
ప్రయాణికులు హోలీ జరుపుకోవడానికి ఇంటికి వెళ్లకుండానే ప్రయాణంలో పండగ వాతావరణాన్ని ఆస్వాదించారు. విమానం ఎక్కింది మొదలు హోలీ జోష్ ప్రారంభమైంది. సిబ్బంది అతిథి మర్యాదలు, సంప్రదాయ స్వీట్లు, విందు, వినోదాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. తద్వారా గాలిలోనే పండుగ సంబరాలు జరుపుకున్నట్లు అయ్యింది. ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..