Twitter: ట్విట్టర్ యూజర్లకు షాక్.. ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం వెలుగులోకి..

|

May 10, 2022 | 7:14 AM

Twitter: ట్విట్టర్‌ కొత్త బాస్‌ ఎలాన్‌ మస్క్‌ మైక్రో బ్లాగ్ సైట్ యూజర్లకు త్వరలోనే భారీ షాకివ్వనున్నారు. ట్విట్టర్‌లో ఇకపై సబ్‌ స్క్రిప్షన్‌ మోడల్‌ను ప్రవేశ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసందే. తాజాగా..

Twitter: ట్విట్టర్ యూజర్లకు షాక్.. ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం వెలుగులోకి..
Elon Musk
Follow us on

Twitter: ట్విట్టర్‌ కొత్త బాస్‌ ఎలాన్‌ మస్క్‌(Elon Musk) మైక్రో బ్లాగ్ సైట్ యూజర్లకు త్వరలోనే భారీ షాకివ్వనున్నారు. ట్విట్టర్‌లో ఇకపై సబ్‌ స్క్రిప్షన్‌ మోడల్‌ను ప్రవేశ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసందే. తాజాగా.. ఈ పరిణామాలకు ఊతం ఇచ్చేలా మరో రిపోర్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాన్‌ మస్క్‌ 44బిలియన్‌ డాలర్లతో ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో కంపెనీని కొనుగోలు చేసినప్పటికీ..  సంస్థ ద్వారా మస్క్‌ భారీ ఆదాయాన్ని గడించే ప్రయత్నాల్లో ఉన్నట్లు టైమ్స్‌ రిపోర్ట్‌ నివేదిక చెబుతోంది. ముఖ్యంగా ట్విట్టర్‌ను వినియోగిస్తున్న బ్లూ టిక్‌ వెరిఫైడ్‌(Blue Tick Verification) అకౌంట్‌ యూజర్ల నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు ఈ వార్తల ప్రకారం తెలుస్తోంది. 2028 నాటికి ఎలాన్ మస్క్‌ వెయ్యి కోట్లను వసూలు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు వెల్లడించింది.

భవిష్యత్తులో ట్విట్టర్‌ ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుందనే విషయాల్ని ఇన్వెస్టర్లకు ఎలాన్‌ మస్క్‌ చెప్పినట్లు తెలిపింది. 2025 నాటికి ట్విట్టర్‌ బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌లను 69 మిలియన్ల మొత్తాన్ని వసూలు చేయడం.. ఆ సబ్‌ స్క్రిప్షన్‌ ద్వారా కొత్త ఫీచర్లను అందించి 2028 నాటికి 128 మిలియన్ల యూజర్ల సంఖ్యను చేరుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ట్విట్టర్‌ బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌పై నెలవారి సబ్‌స్క్రిప్షన్‌ కింద రూ.269 వసూలు చేస్తోంది. ఈ సబ్‌స్క‍్రిప్షన్‌ అందుబాటులో ఉన్న యూజర్లు ట్వీట్‌లను అన్‌డూ చేయడం, ట్వీట్‌లను సేకరించి ఫోల్డర్‌ను క్రియేట్‌ చేయడం, ట్విట్టర్ ఐకాన్‌ కలర్స్‌ మార్చడం వంటి ప్రత్యేక ఫీచర్లను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఈ క్రమంలో.. 2025 నాటికి ట్విట్టర్‌ వినియోగదారుల సంఖ్యను దాదాపు 3రెట్లు పెరిగి 600మిలియన్లకు చేరుకుంటారని, 2028 నాటికి ఆ సంఖ్య 931 మిలియన్లకు చేరుతుందని మస్క్‌ అంచనా వేస్తున్నారు. 2023 నాటికి 9మిలియన్ల యూజర్లు, 2028 నాటికి 104 మిలియన్ మంది యూజర్లు కొత్తగా చేరతారని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

RBI Penalty: ఈ రెండు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. నిబంధనలు పాటించడం లేదని భారీ జరిమానా

Free OTT Plans: అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చిన ఎయిర్ టెల్, రిలయన్స్ జియో..!