Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్‌.. అమ్మకాలలో ఈ కంపెనీ ఫస్ట్‌ ప్లేస్‌..!

|

Apr 10, 2022 | 3:38 PM

Electric Vehicles: గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రిటైల్ అమ్మకాలు మూడు రెట్లు పెరిగి నాలుగు లక్షల యూనిట్ల మార్కును దాటాయి. వీటికి సంబంధించిన

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్‌..  అమ్మకాలలో ఈ కంపెనీ ఫస్ట్‌ ప్లేస్‌..!
Electric Vehicles
Follow us on

Electric Vehicles: గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రిటైల్ అమ్మకాలు మూడు రెట్లు పెరిగి నాలుగు లక్షల యూనిట్ల మార్కును దాటాయి. వీటికి సంబంధించిన సమాచారం ఫెడరేషన్ ఆఫ్ వెహికల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల రిటైల్ అమ్మకాలు 1,34,821 యూనిట్ల నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు పెరిగి 4,29,217 యూనిట్లకు చేరింది. FADA ప్రకారం.. 2019-20లో దేశంలో 1,68,300 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయాలు జరిగాయి. ఈ విభాగంలో టాటా మోటార్స్ 15,198 యూనిట్ల రిటైల్ విక్రయాలతో అగ్రగామిగా నిలిచింది. దీని మార్కెట్ వాటా 85.37 శాతంగా ఉంది. ముంబైకి చెందిన కంపెనీ రిటైల్ విక్రయాలు 2020-21లో 3,523 యూనిట్లుగా ఉన్నాయి. MG మోటార్ ఇండియా 2,045 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. దీని మార్కెట్ వాటా 11.49 శాతంగా ఉంది. 2020-21లో MG మోటార్ విక్రయాలు 1,115 యూనిట్లుగా ఉన్నాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా రెండో స్థానం

మహీంద్రా అండ్ మహీంద్రా 156 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో నిలువగా, హ్యుందాయ్ మోటార్ 128 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో 41,046 యూనిట్ల నుంచి ఐదు రెట్లు పెరిగి 2,31,338 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహన విభాగంలో హీరో ఎలక్ట్రిక్ 65,303 యూనిట్ల విక్రయాలతో అగ్రస్థానంలో నిలిచింది. దీని మార్కెట్ వాటా 28.23 శాతం. ఆ తర్వాత ఓకినావా ఆటోటెక్‌ రెండో స్థానంలో నిలిచింది. దీని విక్రయాలు 46,447 యూనిట్లుగా ఉన్నాయి.

ఆంపియర్ వెహికల్స్ మూడో స్థానం

ఆంపియర్ వెహికల్స్ 24,648 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచాయి. హీరో మోటోకార్ప్‌తో కూడిన ఏథర్ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరంలో 19,971 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించి నాలుగో స్థానంలో నిలిచింది. బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ 14,371 వాహనాలను విక్రయించి ఆరో స్థానంలో నిలువగా, టీవీఎస్ మోటార్ కంపెనీ 9,458 వాహనాలను విక్రయించి ఏడో స్థానంలో నిలిచింది.

Viral Photos: ఇతడొక విచిత్రమైన వ్యక్తి.. గ్రహాంతరవాసికేమి తీసిపోడు..!

Health Tips: కీరదోసలో అద్భుత పోషకాలు.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!