Raptee HV bike: కారు టెక్నాలజీతో ఎలక్ట్రిక్ బైక్.. ఐ 30 మోటారు సైకిల్ రేంజే వేరు

|

Oct 21, 2024 | 2:10 PM

ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలకు ఆసక్తి పెరుగుతోంది వాటికి లభిస్తున్న ఆదరణ, కొనుగోళ్లు దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పలు కంపెనీలు ఈ విభాగంలో వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పటి వరకూ అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి విడుదలయ్యాయి. ప్రత్యేక ఫీచర్లు, రేంజ్, స్పెసిఫికేషన్లతో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ విభాగంలోకి మోటారు సైకిల్ వచ్చి చేరింది. చెన్నైకి చెందిన రాప్టీ హెచ్ వీ అనే స్టార్టప్ కొత్తగా అధిక వోల్టేజీ గల ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ను విడుదల చేసింది. టీ 30 పేరుతో రూపొందించిన దీని ధర రూ.2.39 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ధారించారు.

Raptee HV bike: కారు టెక్నాలజీతో ఎలక్ట్రిక్ బైక్.. ఐ 30 మోటారు సైకిల్ రేంజే వేరు
Raptee Hv Bike
Follow us on

రాప్టీ హెచ్ వీ స్టార్టప్ తయారు చేసిన టీ 30 ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే సాంకేతితతో దీన్ని రూపొందించారు. ముఖ్యంగా ఈ మోటారు సైకిల్ నుంచి వేడి చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. 250 -300 సీసీ ఐసీఈ (పెట్రోలు) బైక్ లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు. టోకెన్ మొత్తంగా రూ.వెయ్యి చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చు. 2025 జనవరి నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. టీ 30 మోటారు సైకిల్ డిజైన్ చాలా ఆకట్టుకుంటోంది. ప్రత్యేక మైన స్పోర్ట్ లుక్ తో అదరహో అనిపిస్తోంది. బైెక్ లో ఎక్కువ భాగం కవర్ చేసి ఉంటుంది. ఆకట్టుకునే హెడ్ లైట్లు, టచ్ స్క్రీన్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. బైక్ వేగం, బ్యాటరీ సామర్థ్యం, సమయం, స్టాండ్ అలెర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ, జీపీఎస్ నావిగేషన్ తదితర ఫీచర్లు దీనిలో ఉంటాయి. 

స్ట్పిట్ సీట్ తో పాటు వెనుక భాగంలో గ్రాబ్ హ్యాండిల్స్ ఏర్పాటు చేశారు. తెలుపు, నలుపు, ఎరుపు, బూడిద రంగులలో టీ 30 ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులో ఉంది. కొత్త బైక్ లో 5.4 కేడబ్ల్యూహెచ్ కెపాసిటీ కలిగిన 240 వోల్ట్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. దీని నుంచి 22 కేడబ్ల్యూ గరిష్ట శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇది 30 బీహెచ్ పీ పవర్, 70 న్యూటన్ మీటర్ టార్క్ కి సమానం. కేవలం 3.6 సెకన్లలోనే సున్నా నుంచి 60 కేఎంపీఎల్ వేగానికి చేరుకుంటుంది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. 

రాప్టీ టీ 30 బైక్ కు అన్ని రకాల చార్జింగ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇంటిలోని సాకెట్ కు చార్జర్ పెట్టి బండిని చార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే చార్జింగ్ స్టేషన్ లో ఫాస్ట్ చార్జర్ సాయంతో బ్యాటరీని చార్జింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా 40 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకూ చార్జింగ్ అవుతుంది.  దేశంలో అందుబాటులో ఉన్న 13,500 సీసీఎస్2 కార్ చార్జింగ్ స్టేషన్ల లో సేవలను వినియోగించుకోవచ్చు. రాప్టీ హెచ్ వీ విడుదల చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఇది. ఈ స్టార్టప్ ను సీఈవో దినేష్ అర్జున్ 2019లో ప్రారంభించారు. ఆయనకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎంతో అనుభవం ఉంది. ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో కూడా ఆయన పనిచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..