చాలా మంది వాహనదారులకు నిబంధనలు ఉల్లంఘించినందుకు చలాన్‌కు సంబంధించి మెసేజ్ వస్తుంటాయి. చలాన్ చెల్లించకపోతే, కోర్టు నుంచి నోటీసు అందుతుందని ఆ మెసేజ్ లో ఉంది. మెసేజ్ లో పేమెంట్ చేయడం కోసం ఒక లింక్ కూడా ఉంది. కానీ టెన్షన్ తో వెంటనే లింక్‌పై క్లిక్ చేస్తే మాత్రం ప్రమాదంలో పడిపోయినట్లే. వెంటనే ఫోన్ హ్యాక్ అయిపోతుంటుంది. హ్యాకర్లు అతని వ్యక్తిగత వివరాలను యాక్సెస్ చేసి దాదాపు వేలాది రూపాయలు కాజేస్తున్నట్లు ఇటీవల నివేదికల ద్వారా తెలిసింది.
చాలా మందికి సైబర్ దొంగలు ఈ-చలాన్ల మెసేజ్ లు పంపిస్తున్నారు. కోర్టు నుంచి నోటీసు అందుతుందనే భయంతో ఇటువంటి వారు కంగారు పది వెంటనే లింక్‌పై క్లిక్ చేస్తారు. దీంతో మోసగాళ్ల వలలో చిక్కుకుపోతారు. ఇటీవలి కాలంలో ఇలాంటి మోసాల కేసులు గణనీయంగా పెరిగాయి. ఇలాంటి మోసాల కేసులు పెరుగుతున్న దృష్ట్యా పోలీసులు, ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ సైబర్ మోసగాళ్లు ఎలా మోసం చేస్తారు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. అలానే ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండడం కోసం మనం ఎలా వ్యవహరించాలీ అనే విషయాన్ని అర్ధం చేసుకుందాం.
అసలు ముందుగా మోసగాళ్లు అలాంటి మోసాలకు ఎలా పాల్పడతారో తెలుసుకుందాం. సైబర్ స్కామర్‌లు ఇ-చలాన్ అలర్ట్‌స్ లా కనిపించే టెక్స్ట్ మెసేజెస్ ను పంపుతారు. ఆ మెసేజ్ లో ఎదో ఒక చలాన్ నంబర్ పేమెంట్ లింక్ ఉంటుంది. మీరు దానిపై క్లిక్ చేసిన వెంటనే, మీ ఫోన్ సేఫ్టీ చేజారిపోతుంది. హ్యాకర్‌లు మీ క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలకు యాక్సెస్‌ను పొంది, ఆపై మీ ఎకౌంట్ నుంచి డబ్బును విత్ డ్రా చేసేస్తారు. ఇదంతా చాలా స్పీడ్‌గా అయిపోతుంది. మీరు లింక్ పై క్లిక్ చేసిన తరువాత నిమిషాల వ్యవధిలోనే మీ డబ్బు మాయం అయిపోతుంది.
ఇప్పుడు మనం అలాంటి మోసాల బారిన పడకుండా ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉంటే, వారు నిజమైన – నకిలీ మెసేజ్‌ల మధ్య తేడాను గుర్తించగలరు. నిజమైన చలాన్ మెసేజ్‌లో ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్, వాహన గుర్తింపు సంఖ్య (VIN) – వెహికిల్ కి సంబంధించిన ఇతర సమాచారం తప్పనిసరిగా ఉంటుంది. ఈ సమాచారంలో ఏ ఒక్కటైనా చలాన్ మెసేజ్ లో కనిపించకపోతే అది కచ్చితంగా ఫేక్ అయి ఉంటుంది
అంతేకాకుండా, మీరు పేమెంట్ లింక్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తే, మీరు అసలు – నకిలీకి మధ్య వ్యత్యాసాన్ని కూడా చెప్పవచ్చు. నిజమైన ఇ-చలాన్ మెసేజ్‌లో చెల్లింపు కోసం అందించిన లింక్ ఇలా ఉంటుంది – “echallan.parivahan.gov.in/”. కానీ స్కామర్లు ఇచ్చిన లింక్ కొంతవరకు దీనిని పోలి ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే, మీరు తేడాను గుర్తించవచ్చు. ఎందుకంటే ఆ లింక్ ఇలా ఉండవచ్చు. “echalan.parivahan.in/”. ఇక్కడ, మీరు జాగ్రత్తగా చదివితే, నిజమైన చలాన్ మెసేజ్ లింక్ gov.inతో ఎండ్ అయిన విషయాన్ని మీరు గమనించ వచ్చు. ఫేక్ మెసేజ్‌లో ఇచ్చిన లింక్‌లో ఇది ఉండదు.
మీకు ఏదైనా చలాన్ మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఏమి చేయాలి?
మీరు చలాన్ మెసేజ్ అందుకున్నప్పుడు.. వెంటనే ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి చలాన్ వాస్తవంగా ఉన్నదీ లేనిదీ చెక్ చేసుకోవచ్చు. దీని కోసం పరివాహన్ వెబ్‌సైట్‌కి వెళ్లండి. అక్కడ నుంచి చలాన్‌ని డౌన్‌లోడ్ చేయండి. అన్ని చలాన్లు పరివాహన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి క్రాస్ చెక్ చెక్ చేయండి. అలాగే, ఇ-చలాన్ అలర్ట్‌లు ఎప్పుడూ వ్యక్తిగత మొబైల్ నంబర్‌ల నుంచి రావు. మీకు వ్యక్తిగత నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందీ అంటే అది కచ్చితంగా నకిలీదిగా చెప్పవచ్చు. మీరు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే, మీరు ఇలాంటి మోసాలకు దూరంగా ఉం ఉండవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి