మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. గడిచిన కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండడం విశేషం. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఒకానొక సమయంలో రూ. 60 వేలు దాటేసి దూసుకుపోతుండగా, క్రమంగా తగ్గిన ధరతో మళ్లీ రూ. 60 వేల దిగువకు చేరుకోవడం విశేషం. ఇక తాజాగా శుక్రవారం సైతం బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 190 తగ్గగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 210 తగ్గడం విశేషం. ఇక శుక్రవారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,550గా ఉండగా, 24 క్యారెట్స్ ధర రూ. 57,310గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్స్ ధర రూ. 52,950, 24 క్యారెట్స్ ధర రూ. 57,760 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 52,400గా ఉండగా, 24 క్యారెట్స్ ధర రూ. 57,760గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్స్ ధర రూ. 52,400కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 57,160గా ఉంది. ఇక బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,400కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,160గా ఉంది. పుణెలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,160గా ఉంది.
హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,400కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,160గా ఉంది. ఇక నిజామాబాద్‌లో 22 క్యారెట్ల ధర రూ. 52,400గా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 57,160గా ఉంది. వరంగల్ విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్స్ ధర రూ. 52,400కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 57,160 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,400 గా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 57,160 గా ఉండగా, విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక బంగారం ధర తగ్గుముఖం పడితే.. మరోవైపు వెండి ధరలో మాత్రం పెరుగుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధర పెరిగింది. శుక్రవారం కిలో వెండిపై ఒకేసారి ఏకంగా రూ. 400 పెరగడం గమనార్హం. దీంతో చెన్నైలో కిలో వెండి ధర రూ. 73,500కి పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 71,100కి చేరింది. ఇక ఢిల్లీతో పాలు కోల్‌కతాలోనూ కిలో వెండి ధర శుక్రవారం రూ. 71,100గా ఉంది. బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ. 69,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 73,500గా ఉండగా. విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ శుక్రవారం కిలో వెండి ధర రూ. 73,500 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..