Credit Card: ఫోన్లో క్రెడిట్ కార్డు వివరాలు పంపుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే..

ఎక్కువగా ఫోన్ ద్వారానే మనం అన్ని లావాదేవీలు జరుపుతున్నాం కాబట్టి.. ఆ ఫోన్ ద్వారానే నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఎక్కువ. ఈక్రమంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగించే వారు వారి కార్డు వివరాలు ఫోన్లో భద్రం చేసుకోకపోవడం ఉత్తమం. ఎవరైనా వ్యాపారులకు సైతం ఫోన్లో కార్డు వివరాలు చెప్పకపోవడం మేలు.

Credit Card: ఫోన్లో క్రెడిట్ కార్డు వివరాలు పంపుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే..
Credit Cards

Updated on: Jan 29, 2024 | 8:15 AM

మీరు క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ఆన్ లైన్ లావాదేవీలు అధికమవుతున్న ప్రస్తుత తరుణంలో మోసాలకు కూడా ఎక్కువ అవకాశం ఉంది. సైబర్ నేరగాళ్లు ఎక్కడ దొరకుతామా అని పొంచి ఉంటారు. ఎక్కువగా ఫోన్ ద్వారానే మనం అన్ని లావాదేవీలు జరుపుతున్నాం కాబట్టి.. ఆ ఫోన్ ద్వారానే నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఎక్కువ. ఈక్రమంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగించే వారు వారి కార్డు వివరాలు ఫోన్లో భద్రం చేసుకోకపోవడం ఉత్తమం. ఎవరైనా వ్యాపారులకు సైతం ఫోన్లో కార్డు వివరాలు చెప్పకపోవడం మేలు. అయితే ఇటీవల కాలంలో ఇది ఎక్కువగానే జరుగుతుంది. వినియోగదారులు ఫోన్ ద్వారా తమ కార్డు వివరాలు చెబుతూ లావాదేవీలు జరుపుతున్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఓ సారి చూద్దాం..

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

మీరు కనుక మీ క్రెడిట్ కార్డు వివరాలు ఫోన్ ద్వారా ఇవ్వాల్సి వస్తే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు మీరు మోసపోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అదెలా అంటే..
కాలర్ ను ధ్రువీకరించాలి.. మీకు ఏదైనా కంపెనీ నుంచి కాల్ వచ్చిందనుకోండి.. కార్డు వివరాలు చెప్పమని అడిగితే మీరు వెంటనే కంపెనీ నంబర్ కాల్ చేసి వెరిఫై చేసుకోవాలి. స్కామర్లు ప్రఖ్యాతి గాంచిన కంపెనీల నుంచి ఫోన్ చేస్తున్నట్లుగానే మాట్లాడారు. మీరు చేసిన పేమెంట్ ఫెయిల్ అయిందని, కొత్త పేమెంట్ చేయాలని చెబుతుంటారు. అటువంటి కాల్స్ మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఆ కాల్ జెన్యూనా కాదా అనేది సరిచూసుకోవాలి. ఒకసారి కాల్ కట్ చేసి రిటర్న్ కాల్ చేయాలి. అవతలి వారి మాట తీరు ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి.

సెక్యూర్ పేమెంట్ ఆప్షన్స్.. అలాగే పేమెంట్ చేసే ముందు అంతకుముందు చేసిన సెక్యూర్ పేమెంట్ మెథడ్స్ ద్వారానే వెళ్లొచ్చు. అదే విధానంలో చేస్తామని చెప్పండి.

ఇవి కూడా చదవండి

రికార్డులు భద్రం చేయండి.. కంపెనీకి సంబంధించిన రికార్డులన్నీ భద్రం చేసుకోవాలి. రిప్రంజెంటేటివ్ తీసుకున్న చార్జీలు, మీరు చేసిన లావాదేవీల వివరాలు పొందుపర్చుకోవాలి. ప్రతి దానికి రిసిప్ట్ తీసుకోవడం మర్చిపోవద్దు.

వర్చువల్ క్రెడిట్ కార్డులు..

మీ క్రెడిట్ కార్డుల డేటాను భద్రంగా కాపాడుకునేందుకు ఫ్రాడ్ ల భయం తొలగించేందుకు ఈ వర్చువల్ ఐడీ కార్డులు బాగా ఉపకరిస్తాయి. మీరు ఇప్పటికే వర్చువల్ ఐడీ కార్డును కలిగి ఉంటే మొబైల్ పేమెంట్ల కోసం దీనిని మొబైల్ కు యాడ్ చేసుకోండి. కొన్ని బ్యాంకులు ఈ వర్చువల్ కార్డుల కోసం యూనిక్ కార్డ్ నంబర్లు, సీవీవీలను అందిస్తాయి.

కార్డు దొంగతనానికి గురైతే..

అనుకోని సందర్భంలో మీ క్రెడిట్ కార్డు దొంగతనానికి గురైనా లేదా.. మీరే పోగొట్టుకున్నా వెంటనే మీరు అప్రమత్తం అవ్వాలి. బ్యాంక్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి ఆ కార్డును బ్లాక్ చేయమని చెప్పాలి. లేకుంటే దానిని మిస్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే కచ్చితంగా దొంగతనం జరిగిందని భావిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి. అలాగే పోయిన ఆ కార్డుపై ఏమైనా లావాదేవీలు జరుగుతున్నామేయో మీ యాప్ లో ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి.

అన్నింటికన్నా మించి.. మీరు ఫోన్ మీ క్రెడిట్ కార్డు వివరాలు ఎవరికీ ఇవ్వకపోవడం వెయ్యి రెట్లు ఉత్తమం. అలాగే అనధికారిక వెబ్ సైట్లలో కూడా క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వడం మంచిది కాదు. అలాంటి సందర్భాల్లో మీకు బాగా ఉపయోగపడేవి వర్చువల్ కార్డులు. ఇది ఒకవేళ ఫ్రాడ్ స్టర్ల చేతుల్లో పడినా నష్ట తీవ్రత ఉండదు. వెంటనే దాని ఐడెంటిటీని రద్దు చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..