Business Idea: ఊర్లో ఉంటూనే వ్యాపారం చేయాలనుకుంటున్నారా.? ఇదిగో బెస్ట్‌ ఐడియాస్‌..

కొందరికి ఇది ఇబ్బందిగా ఉంటుంది. ఉన్న ఊర్లోనే ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ఉంటారు. అయితే సరైన ప్లానింగ్‌ లేకపోవడంతో ఎలాంటి బిజినెస్‌ చేయాలో అర్థం కాక నష్టపోతుంటారు. కానీ కాస్త తెలివి ఉపయోగించి కొంచెం పెట్టుబడి పెడితే చాలు ఉన్న ఊర్లోనే భారీగా సంపాదన ఆర్జించవచ్చు...

Business Idea: ఊర్లో ఉంటూనే వ్యాపారం చేయాలనుకుంటున్నారా.? ఇదిగో బెస్ట్‌ ఐడియాస్‌..
Business Ideas

Updated on: Mar 04, 2024 | 4:13 PM

ప్రస్తుతం యువత ఆలోచనలో క్రమంగా మార్పు వస్తుంది. ఒకప్పుడు చదువు పూర్తయ్యాక కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసిన తర్వాత వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉండే వారు కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇలా చదువు అవ్వగానే అలా వ్యాపారం చేసేస్తున్నారు. ఇక ఉద్యోగం అనగానే పట్టణాలకు కచ్చితంగా వలస వెళ్లాలి.

కొందరికి ఇది ఇబ్బందిగా ఉంటుంది. ఉన్న ఊర్లోనే ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ఉంటారు. అయితే సరైన ప్లానింగ్‌ లేకపోవడంతో ఎలాంటి బిజినెస్‌ చేయాలో అర్థం కాక నష్టపోతుంటారు. కానీ కాస్త తెలివి ఉపయోగించి కొంచెం పెట్టుబడి పెడితే చాలు ఉన్న ఊర్లోనే భారీగా సంపాదన ఆర్జించవచ్చు. అలాంటి కొన్ని బెస్ట్‌ బిజినెస్‌ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* గ్రామాల్లో బెస్ట్‌ వ్యాపారాల్లో పాడి పరిశ్రమ మొదటి స్థానంలో ఉంటుంది. గ్రామాల్లో ఉండే వాతావరణం, పశువులకు లభించే మేత కారణంగా ఈ వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించవచ్చు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని కాస్త స్థలం ఉంటే చాలు ఎంచక్కా పాల వ్యాపారం చేయొచ్చు. పాలను స్థానికంగా ఉండే పాల కేంద్రాల్లో విక్రయించుకుంటే మంచి లాభాలు పొందొచ్చు.

* ఇక గ్రామాల్లో లాభాలు ఆర్జించే మరో వ్యాపారం.. వ్యవసాయ పనిముట్లను, యంత్రాలను అద్దెకు ఇవ్వడం. ఇటీవల అద్దెకు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మంచి ఆదాయం పొందొచ్చు.

* ఒకవేళ మీకు సొంతంగా భూమి ఉంటే మాత్రం పండ్లు, కూరగాయల సాగు, పూల పెంపకం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. కాలానికి అనుగుణంగా మంచి ప్లానింగ్‌తో పంటలు పండిస్తే ఉన్న ఊర్లోనే లక్షల్లో ఆర్జించవచ్చు.

* ఇటీవల చిన్న చిన్న పట్టణాల్లో కూడా బ్రాండ్‌ టీ దుకాణాలకు డిమాండ్‌ పెరిగింది. మంచి వాతావరణంతో థీమ్‌ బేస్డ్‌ టీ దుకాణాలను ఏర్పాటు చేసుకుంటే మంచి ఆదాయం పొందొచ్చు.

* ప్రస్తుతం ఇంటర్నెట్ విస్తృతి బాగా పెరిగింది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు ఇలా దేనికైనా ఇంటర్నెట్ సేవలు అవసరపడుతున్నాయి. కాబట్టి మీ సొంతూర్లో మీ సేవ లేదా ఇంటర్నెట్ కేఫ్‌ లాంటివి ప్లాన్‌ చేసుకుంటే మంచి ఆదాయాలు ఆర్జించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..