Low Investment: ఎండాకాలం 2 నెలలు ఈ బిజినెస్ చేస్తే పెట్టుబడి పోను 2 లక్షల లాభం.. నో రిస్క్..

జాబ్ చేస్తే ఎప్పుడూ ఒకరి కింద ఉండాల్సిందే. అదే బిజినెస్ అయితే ఇండిపెండెంట్ లైఫ్. కాస్త తెలివి పెడితే సీజనల్ బిజినెస్ చేసి లక్షలు సంపాదించుకోవచ్చు. మీ బిడ్డల బంగారు జీవితానికి బాటలు వేసుకోవచ్చు.

Low Investment: ఎండాకాలం 2 నెలలు ఈ బిజినెస్ చేస్తే పెట్టుబడి పోను 2 లక్షల లాభం.. నో రిస్క్..
Currency

Edited By:

Updated on: Apr 14, 2023 | 3:15 PM

ఎమ్.ఎన్.సీ కంపెనీల్లో జాబ్స్ చేసేవాళ్లని పక్కన పెట్టండి. వాళ్లకు నెలకు లక్షలు లక్షలు జీతాలు వస్తాయ్ కాబట్టి.. నో ప్రాబ్లం. చిన్న.. చిన్న జాబ్స్ చేసేవాళ్ల పరిస్థితి అగమ్యగోచరం. పెళ్లై, పిల్లలు ఉంటే.. ఆ కష్టాలు చెప్పతరమా. శాలరీ పడగానే అన్ని సెటిల్మెంట్స్ అయిపోతాయ్. చేతిలో పైసా ఉండదు. ఈఎమ్‌ఐలు కట్టేందుకు చేబదులు చేయడమో, క్రెడిట్ కార్డు గోకేయడమో చెయ్యాలి. ఈ జాబ్‌లు చేసి.. ఎదిగిపోవడం, జీవితంలో మంచి సెటిల్ అవ్వడం కలే. అందుకే కొంత డబ్బు సమకూర్చుకుని నష్టం రాదు అని నమ్మకంగా అనిపించే బిజినెస్ చేస్తే కొద్డో, గొప్పో వెనకేసుకోవచ్చు. అలాంటి ఓ ఐడియాతోనే మేము మీ ముందుకు వచ్చాం. మంచి ఏరియాను ఎన్నుకుని ఈ బిజినెస్ పెడితే.. ఈ ఎండాకాలం 2,3 నెలల్లో 2 లక్షలు వెనకేసుకోవచ్చు. అది కూడా తక్కువ ఖర్చుతో.

మేం చెప్పేది మరేంటో కాదండీ బాబు. కొబ్బరి బోండాల బిజినెస్. ఎండాకాలంలో జనాలు కొబ్బరి నీళ్లు బాగా తాగుతారు. ఆరోగ్యాన్ని పట్టించుకునేవారు అందరూ కూల్‌డ్రింక్స్ వైపు వెళ్లకుండా నేచరల్ డ్రింక్..కోకోనట్ వాటర్ ఫ్రిపర్ చేస్తారు. అందుకే మీ వద్ద ఒక లక్ష రూపాయలు ఉన్నాయి అనుకోండి.. పట్టణాల్లో, సిటీల్లో, ఓ హైవే పక్కనే ఓ పెద్ద నీడ ఉన్న చెట్టు చూసుకుని.. కొబ్బరి బోండాలు పెట్టుకోవచ్చు. మనకి ప్రస్తుతం గోదావరి జిల్లాలతో పాటు బెంగళూరు బోండాలు అందుబాటులో ఉన్నాయి.

ఉదాహారణకు.. గోదావరి బోండాల బిజినెస్ పెట్టాలనుకునే మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారు అనుకోండి.. ఒక్కో బోండం ఇక్కడికి చేరేసరికి 25 నుంచి 30 రూపాయలు పడుతుంది. ఇక్కడ బోండం 50 రూపాయలకు అమ్ముకోవచ్చు. అంటే ఒక్కో బోండానికి 20 రూపాయల లాభం నికరంగా ఉంటుంది. రోజుకు తక్కువలో తక్కువ 200 కాయ అమ్ముకున్నా.. 4000 వరకు ఆదాయం వస్తుంది. అంటే నెలకు లక్షా 20 వేలు. పైన 20 వేలు వివిధ కారణాల వల్ల తీసేసుకన్నా లక్ష ఆదాయం ఎటూ పోదు. అలా సమ్మర్ పీక్‌ ఉండే 2 నెలలు వీటిని అమ్ముకున్నా 2 లక్షలు మీరు వెనకేసుకోవచ్చు. అయితే ఇక్కడ సరైన స్పాట్ సెలక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే బిజినెస్ ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వ్యాపారం జరిగితే లాభం పెరుగుతుంది.

 

Coconut Business

మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. 

 

Follow Us