Low Investment: ఎండాకాలం ఈ బిజినెస్ చేస్తే పెట్టుబడి పోను 2 లక్షల లాభం.. రిస్కే లేదు

కొద్దిపాటి జాబులు చేసేవాళ్లకు పెరిగిన ఖర్చులకు కుటుంబాన్ని నడపాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. కొందరు అయితే వారంలోనే శాలరీ అయిపోవడంతో.. క్రెడిట్ కార్డ్స్ వాడుతూ.. వారి దగ్గర.. వీరి దగ్గర అప్పులు తీసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. అలాంటివారు ఎదిగేందుకు రిస్క్ లేని ఓ బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాం...

Low Investment: ఎండాకాలం ఈ బిజినెస్ చేస్తే పెట్టుబడి పోను 2 లక్షల లాభం.. రిస్కే లేదు
Cash

Updated on: Feb 24, 2025 | 5:55 PM

నెలకు లక్షల్లో ప్యాకేజ్ ఉన్నవారి సంగతి పక్కనపెట్టండి.. వారికి పెద్దగా మనీ ప్రాబ్లమ్స్ ఉండవ్. కానీ ఫ్యామిలీని పెట్టుకుని 50 వేల లోపు సంపాదించేవారి పరిస్థితి అగమ్యకోచరంగా ఉంటుంది. వచ్చిన మొదటిరోజే ఇంటి అద్దె, క్రెడిట్ కార్డులు, EMIలు, గ్రాసరీస్‌కు పే చేస్తే అకౌంట్ ఖాళీ అవుతుంది. ఇక మళ్లీ నెలంతా క్రెడిట్ కార్డు గోకడంతో పాటు.. తెలిసిన వాళ్ల దగ్గర చేబదులు తీసుకుంటూ నెట్టుకెళ్తూ ఉంటారు. ఇలాంటి జాబ్స్ చేసే.. హ్యాపీ జీవితం గడపడం కష్టమే. జీవితాంతం కష్టాలతో బండి లాగించాల్సి ఉంటుంది. అందుకే కొంత డబ్బుతో.. లాస్ ఉండదు అనుకున్న బిజినెస్ పెడితే కొంతమేర వెనకేసుకోవచ్చు. అలాంటి మాంచి ఐడియాను మీ ముందుకు తెచ్చాం. మంచి ప్లేస్ చూసి.. ఈ సీజనల్ బిజినెస్ పెడితే.. తక్కువ సమయంలోనే మినిమం ప్రాఫిట్ ఉంటుంది. ఖర్చు తక్కువలో మంచి అందరికీ అందుబాటులో ఉండే బిజినెస్ కూడా ఇది..

మేం చెప్పేది ఓ పెద్ద రిస్క్ యవ్వారం అనుకోకండి. కొబ్బరి బోండాల వ్యాపారం. ఎండలకు జనం కొబ్బరి నీళ్లు బాగా తాగుతారు. ఒకప్పుడు పక్కనబెట్టండి. కరోనా అనంతరం హెల్త్ కాన్సియస్ బాగా వచ్చింది. కూల్ డ్రింగ్స్ వంటివి దూరం పెట్టి కొబ్బరినీళ్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందుకే మంచి పాయింట్ దొరికితే ఈ బిజినెస్ సూపర్ సేఫ్.  మీ వద్ద ఒక లక్ష ఉంటే.. సీటీల్లో, టౌన్స్‌లో లేదా ఓ హైవే పక్కనే ఓ పెద్ద నీడ ఉన్న చెట్టు చూసుకుని.. కొబ్బరి బోండాలు పెట్టుకోవచ్చు. మనకి ప్రస్తుతం ఆంధ్రాలోని గోదావరి జిల్లాలతో పాటు బెంగళూరు బోండాలు మనకు అందుబాటులో ఉన్నాయి.

ఫర్ ఎగ్జాంపుల్.. గోదావరి బోండాల బిజినెస్ పెట్టాలనుకునే మీరు…  హైదరాబాద్‌లో ఉంటున్నారు అనుకుందాం.. ఒక్కో బోండం ఇక్కడికి తెచ్చేసరికి 30 రూపాయల వరకు పడుతుంది. ఇక్కడ బోండం 50 నుంచి 60 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. అంటే ఒక్కో బోండానికి 20 రూపాయల లాభం పక్కాగా ఉంటుంది. రోజుకు ఓ మోస్తారుగా 200 కాయ అమ్ముకున్నా.. 4000 వరకు ప్రాఫిట్ వచ్చినట్లే . అంటే నెలకు లక్షా 20 వేలు. రోజుకు 1000 లెక్కన ఒక బోండాలు కొట్టే మనిషిని పెట్టుకున్నా.. నెలకు 30 వేల ఖర్చు వస్తుంది. అంటే 90 వేల లాభం ఎటూ పోదు. అలా సమ్మర్ పీక్‌ ఉండే 3 నెలలు వీటిని అమ్ముకున్నా 2.5 నుంచి 3 లక్షలు  వెనకేసుకోవచ్చు. అయితే ఇక్కడ సరైన పాయింట్ దొరకడం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే బిజినెస్ రన్ ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వ్యాపారం జరిగితే లాభం ఇంకా పెరుగుతుంది.

Coconut Business

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..