దీపావళి రోజు ఊహించని విధంగా బంగారం ధరలు..!

| Edited By:

Oct 27, 2019 | 7:43 AM

దీపావళి, దంతేరాస్‌కి ప్రజలు బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజుల్లో ఎంతో కొంత బంగారం కొంటే.. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని.. వారి నమ్మకం. ముఖ్యంగా.. దీపావళి, దంతేరాస్‌ పండుగ దినాల్లో.. బంగారం అమ్మకాలు ఊపందుకుంటాయి. లక్ష్మీదేవిని కొలిచే దీపావళి పండుగ కావడం.. అంతకంటే ముందే దంతేరాస్ రోజున బంగారం కొంటే.. లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్మకంతో.. బంగారం కొనుగోలు చేస్తారు. ఆ రోజున కుదరని వారు.. దీపావళి రోజున బంగారం కొంటూంటారు. అలాగే.. దీపావళి రోజున […]

దీపావళి రోజు ఊహించని విధంగా బంగారం ధరలు..!
Follow us on

దీపావళి, దంతేరాస్‌కి ప్రజలు బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజుల్లో ఎంతో కొంత బంగారం కొంటే.. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని.. వారి నమ్మకం. ముఖ్యంగా.. దీపావళి, దంతేరాస్‌ పండుగ దినాల్లో.. బంగారం అమ్మకాలు ఊపందుకుంటాయి. లక్ష్మీదేవిని కొలిచే దీపావళి పండుగ కావడం.. అంతకంటే ముందే దంతేరాస్ రోజున బంగారం కొంటే.. లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్మకంతో.. బంగారం కొనుగోలు చేస్తారు. ఆ రోజున కుదరని వారు.. దీపావళి రోజున బంగారం కొంటూంటారు. అలాగే.. దీపావళి రోజున లక్ష్మీ దేవి పూజలు చేస్తారు.

కాగా.. దీపావళికి పడిసి ధరలు తగ్గుతాయని అందరూ.. భావించినా.. అందుకు రివర్స్‌గా.. పెరుగుతూ వచ్చాయి. తాజాగా.. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.39,850గా ఉంది. అలాగే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర రూ.36,700లుగా ఉంది. అయితే.. ఈ నెల ప్రారంభంలో.. రూ.38,510లుగా ఉన్న బంగారం ధర నెల చివరికి వచ్చేసరికి.. రూ.1300 పెరిగింది. అలాగే.. కిలో వెండి రూ.48,770లుగా ఉంది.

ఇదిలా ఉంటే.. నవంబర్ 5, 2018 దీపావళికి బంగారం ధరలు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,000లుగా ఉంది. దీన్ని బట్టి ఒక సంవత్సరంలోనే.. దాదాపు 9వేలకి పైగా పసిడి ధర పెరిగింది.