Tax Collection: దేశంలో పుంజుకున్న ఆర్థిక కార్యకలాపాలు.. భారీగా పెరిగిన పన్ను వసూళ్లు

|

Dec 12, 2022 | 5:56 PM

దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. పన్ను వసూళ్లపై సానుకూల ప్రభావం చూపింది. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బడ్జెట్ అంచనాలో 62 శాతం అంటే 24 శాతం జంప్‌తో..

Tax Collection: దేశంలో పుంజుకున్న ఆర్థిక కార్యకలాపాలు..  భారీగా పెరిగిన పన్ను వసూళ్లు
Tax Collection
Follow us on

దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. పన్ను వసూళ్లపై సానుకూల ప్రభావం చూపింది. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బడ్జెట్ అంచనాలో 62 శాతం అంటే 24 శాతం జంప్‌తో రూ.8.77 లక్షల కోట్లకు చేరాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే పన్ను వసూళ్లు 24 శాతం వేగంతో పెరిగాయి. 2022-23లో ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.14.20 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఇది గత ఏడాది రూ.14.10 లక్షల కోట్ల కంటే ఎక్కువ. కార్పొరేట్ పన్ను, వ్యక్తిగత ఆదాయపు పన్ను కలపడం ద్వారా ప్రత్యక్ష పన్ను వసూలు చేయబడుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఏప్రిల్ 1 – నవంబర్ 30 మధ్య రూ. 2.15 లక్షల కోట్లు వాపసు చేసింది.

 


ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. నవంబర్ 30, 2022 వరకు, 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి 6.97 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారు. అలాగే, ప్రీ-ఫీల్డ్ డేటా కారణంగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం సులభం అయిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

 


2022-23లో కూడా ఒకేరోజు 2.42 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని, ఇది రికార్డు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, ఐటీఆర్‌ ప్రాసెసింగ్ ఇప్పుడు చాలా తక్కువ సమయంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021-22లో 26 రోజులుగా ఉన్న సమయం 16 రోజులకు తగ్గిందని వెల్లడించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి