
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ప్రస్తుతం 11 మంది ఎన్ పీఎస్ ఫండ్ మేనేజర్లు ఉన్నారు. వీరు ఈక్విటీ (ఈ), కార్పొరేట్ డెట్ (సీ), ప్రభుత్వ బాండ్‌లు (జీ), ఆల్టర్నేట్ ఫండ్‌లు (ఏ)తదితర వాటిలో పెట్టుబడులు పెడతారు. ఎన్ఫీఎస్ పథకంలో టైర్ – 1, టైర్ – 2 అనే రెండు రకాల ఖాతాలు ఉంటాయి. టైర్ -1 అనేది తప్పనిసరి ఖాతా. పదవీ విరమణ కోసం రూపొందించిన దీర్థకాలిక పొదుపు పథకం. దీనిలో డబ్బులను ఉపసంహరించుకునేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇక టైర్ -2 అనేది ఐచ్చిక ఖాతా. దీనిలో డబ్బులను ఎప్పుడైనా డ్రా చేసుకునే వీలుంటుంది. ఎన్పీఎస్ చందాదారులు దాని పరిధిలోని ఫండ్ మేనేజర్లలో ఎవరినైనా ఎంచుకోవచ్చు. వారి ద్వారా మీ డబ్బులను వివిధ ఫండ్స్ లో పెట్టుబడి పెడతారు. అధిక రాబడి సంపాదించాలనుకునేవారు మంచి ఫండ్ మేనేజర్ ను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వివిధ ఫండ్స్ మేనేజర్ల ఇన్వెస్టుమెంట్లు వేర్వేరు రకాలుగా ఉంటాయి. కాగా..ఐదేళ్లలో ఎన్పీఎస్ ఈక్విటీ ఫండ్స్, టాప్ 5 లార్జ్ మ్యూచువల్ ఫండ్స్ అందించిన రాబడి వివరాలు ఇలా ఉన్నాయి.
గత ఐదేళ్లలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఫండ్ ఇది. ఈక్విటీ విభాగంలో 25.25 శాతం రాబడిని అందించింది. ఎన్ పీఎస్ చందాదారుల కోసం స్కీమ్- ఈని అమలు చేసింది. ఇక లార్జ్ క్యాప్ ఫండ్స్ కేటగిరీ సగటు వార్షిక రాబడి 23.36 శాతంగా ఉంది.
ఈ ఫండ్ కూడా తన వాటాదారులకు మంచి లాభాలను అందజేసింది. ఐదేళ్లలో 25.12 శాతం సీఏజీఆర్ నమోదైంది. ఇక లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలో 23.36 శాతం సగటు వార్షిక రాబడినిచ్చింది.
కోటక్ మహీంద్రా పెన్షన్ ఫండ్ కు సంబంధించి ఐదేళ్ల సీఏజీఆర్ 24.85 శాతంగా నమోదైంది. ఇది లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలో సగటు రాబడి 23.36 శాతం కంటే ఎక్కువగా ఉంది.
ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ కూడా ఐదేళ్లలో 24.80 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. ఇది లార్జ్ క్యాప్ ఫండ్స్ కేటగిరీ కంటే కొంచెం ఎక్కువగా నమోదైంది.
ఈ కంపెనీ సీఏజీఆర్ గత ఐదేళ్లలో 24.08 శాతం నమోదైంది. ఇది లార్జ్ క్యాప్ ఫండ్స్ కేటగిరీ సగటు రాబడి కంటే ఎక్కువే.
టాప్ 5 పెన్షన్ ఫండ్స్ ద్వారా వచ్చే ఐదేళ్ల రాబడితో పోలిస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్ కేటగిరీ పనితీరు తక్కువగా ఉంది. అయినప్పటికీ ఈ సమయంలో టాప్ 5 లార్జ్ క్యాప్ ఫండ్‌లు వ్యక్తిగతంగా గణనీయమైన మార్జిన్‌తో పనిచేశాయి. దీర్ఘకాలిక పదవీ విరమణ ప్రణాళిక కోసం ఎన్ పీఎస్ ఒక శక్తివంతమైన సాధనం. స్థిరమైన రాబడి, ప్రభుత్వ పర్యవేక్షణ, పన్ను ప్రయోజనాలను (పాత విధానం) కోరుకునే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..