ప్రస్తుతం భారతదేశంలో ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వారు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపు హడావుడిలో పడ్డారు. జూలై 31న ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపు ఆఖరు తేదీ కావడంతో ట్యాక్స్ చెల్లింపునకు ముందుకు వస్తున్నారు. అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపులకు ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో కొన్ని తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌కమ్ రిటర్న్స్‌లో ముఖ్య పాత్ర పోషించే బ్యాంక్ అకౌంట్ వివరాల నమోదు కొంతమంది తప్పుగా ఎంటర్ చేస్తున్నారు. అయితే వివరాలు వ్యాలిడేట్ అయ్యాక తప్పును ఎలా సరిదిద్దుకోవాలో? తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆదాయపు పన్ను రిటర్న్ గడువు సమీపిస్తున్నందున మీ పన్ను రిటర్న్స్ సమర్పించాక ఆదాయపు పన్ను శాఖ మీకు సొమ్ము రిటర్న్ చేసే సమయంలో ఈ వివరాలు కీలకంగా మారతాయి. కాబట్టి మీ ఐటీఆర్ ఫారమ్‌లో తప్పు ఖాతా వివరాలను సరిచేయడానికి మీరు అనుసరించాల్సిన సింపుల్ విధానాన్ని ఓ సారి తెలుసుకుందాం. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోని ‘ఐటీఆర్ ఫారమ్ పర్టిక్యులర్‌లను మార్చండి’ ఫీచర్ ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంక్ ఖాతా, చిరునామా, మొబైల్ నంబర్, ఈ -మెయిల్ ఐడీ వంటి వివరాల్లో మార్పులు చేసుకోవచ్చు. అయితే ఈ వివరాల ఎడిటింగ్ ఐటీఆర్ ప్రాసెసింగ్‌కు ముందు మాత్రమే ఎవరైనా అభ్యర్థన చేయగలరని గమనించడం ముఖ్యం
పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేసిన తర్వాత వారు తమ ఐటీఆర్‌ను మళ్లీ ధ్రువీకరించాలి. ఐటీఆర్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి ‘నా ఖాతా’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, “బ్యాంక్ ఖాతాలు” ఎంచుకోవాలి. అక్కడ అప్‌డేట్ చేయబడిన బ్యాంక్ ఖాతా పక్కన ఉన్న “రీ-వాలిడేట్” బటన్‌పై క్లిక్ చేయాలి. రీ-వాలిడేషన్ తర్వాత ఐటీఆర్ ప్రాసెస్ అవుతుంది. అలాగే రీఫండ్ జారీ చేస్తారు. అలాగే ఈ దశలోనే పన్ను చెల్లింపుదారులు వారి ఐటీఆర్ ఫారమ్‌లో చిరునామా, మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్‌ను కూడా సరిదిద్దవచ్చు. ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఈ తప్పులను సరిదిద్దవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి