
బంగారం, వెండి ధరల పరుగులకు బ్రేకులు పడ్డాయి.. దంతేరస్ రోజున బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. దీపావళి పండగ ధన్‌తేరాస్‌తోనే ప్రారంభం అవుతుంది. దీపావళికి రెండు రోజులు ముందు ఇది వస్తుంది. దాదాపు 5 రోజుల పాటు సాగుతాయి. ఈ పండగ రోజున గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటాయి. వీటిని కొనాలంటే సామాన్యులు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో దంతేరస్.. శనివారం (అక్టోబర్ 18) రోజున పసిడి ప్రియులకు ఊరట లభించింది.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి..
శనివారం దేశీయంగా నమోదైన ధరల ప్రకారం.. బంగారం వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,30,860, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,19,950 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,90,000లుగా ఉంది..
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.1,30,860, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,950 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,90,000లుగా ఉంది..
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా ధర రూ.1,31,010, 22 క్యారెట్లు రూ.1,20,100 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,72,000లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,860, 22 క్యారెట్లు రూ.1,19,950 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,72,000లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,30,370, 22 క్యారెట్ల ధర రూ.1,19,950 గా ఉంది.. వెండి కిలో ధర రూ.1,90,000లుగా ఉంది.
కాగా.. కొద్దిరోజుల నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ తగ్గాయి. అయినా ధనత్రయోదశి సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొద్ది నెలలుగా బంగారం ధరల్లో నమోదైన పెరుగుదలలో దాదాపు 20 శాతం అసలు బంగారంతో సంబంధం లేకుండా రూపాయి విలువ తగ్గుదల వల్లే ఏర్పడిందన్నారు. రూపాయి బలహీనపడినప్పుడు అంతర్జాతీయ బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, మన మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇదే ఈ మధ్య కాలంలో జరుగుతూ వస్తోందన్నారు.
ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..