Bitcoin value: క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ పరుగులు పెడుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న బిట్ కాయిన్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. రెండు రోజుల క్రితం ట్రేడింగ్‌లో ఈ డిజిటల్ కరెన్సీ వ్యాల్యూ చరిత్రలో తొలిసారి 52,650 డాలర్ల పైకి(రూ. 38,91,186) చేరింది.
ఆ తర్వాత కాస్త తగ్గినప్పటికీ 50,000 డాలర్లకు పైనే ఉంది. భారత కరెన్సీ రూపాయిలో ఇది రూ.37 లక్షలకు పైన. గత రెండు నెలలుగా బిట్ కాయిన్ 25వేల డాలర్ల నుండి 50వేల డాలర్ల ల్యాండ్ మార్కును దాటి ముందుకు చేరింది. ఈ క్రిప్టో కరెన్సీ గతంలో పెట్టుబడులు పెట్టిన వారికి కనక వర్షం కురిపిస్తోంది.
అయితే ఇది ఎంత కాలం కొనసాగుతుంది.. గరిష్టాన్ని తాకిన ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయవచ్చా అనే ఆందోళన చాలామందిలో కొద్దిగా ఉంది. అయితే రోజు రోజుకు పెరుగుతున్న బిట్ విలువ కొంత రిలీఫ్ ఇస్తోంది. ఓ వైపు టెస్లా వంటి దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టడం పెట్టుబాడిదారుల్లో మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది.
మాస్టర్ కార్డ్ వంటివి ఎంపిక చేసిన క్రిప్టోకరెన్సీలను అంగీకరిస్తామని చెప్పడం వంటివి బిట్ కాయిన్‌కు బిగ్ బూస్టింగ్‌గా మారాయి. అయితే మంచి జోష్‌లో పరుగులు పెడుతున్న బిట్ పరుగు ఎక్కడి వరకు అనేది మాత్రం ఎవరూ చెప్పలేక పోతున్నారు.