Credit Card: ఈ ప్రదేశాల్లో క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? మీ కేర్‌ఫుల్.. అప్పుల్లోకి వెళ్లడం గ్యారెంటీ..

చాలామంది క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఎలా వాడాలో తెలియక అప్పులపాలవుతూ ఉంటారు. అయితే కొన్నిచోట్ల క్రెడిట్ కార్డు అసలు వాడకూడదు. వాడటం వల్ల నష్టపోయే అవకాశముంది. ఇవి తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు. ఏయే సందర్భాల్లో వాడకూడదు అనేది తెలుసుకుందాం.

Credit Card: ఈ ప్రదేశాల్లో క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? మీ కేర్‌ఫుల్.. అప్పుల్లోకి వెళ్లడం గ్యారెంటీ..
Credit Card

Updated on: Jul 11, 2026 | 9:06 PM

ఇటీవల క్రెడిట్ కార్డును ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ఎవరి చేతుల్లో చూసినా ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కామర్స్ వెబ్ సైట్లలో ఆఫర్ల కోసం ఎక్కువమంది క్రెడిట్ కార్డు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక అత్యవసర సమయంలో నగదు అవసరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలామంది వినియోగిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి దీనిని ఎలా వాడాలో తెలియక అప్పులపాలవుతూ ఉంటారు. కొన్ని ప్రదేశాల్లో అసలు క్రెడిట్ కార్డు ఉపయోగించకూడదు. ఇలాంటిచోట్ల మీరు వాడితే భారీగా నష్టపోతారు. ఎక్కడెక్కడ ఉపయోగించకూడదనేది ఒకసారి తెలుసుకుందాం.

పెట్రోల్ బంకుల వద్ద ఉపయోగించకండి

పెట్రోల్ పంపుల వద్ద క్రెడిట్ కార్డు ఉపయోగించకూడదు. GSTతో పాటు ఫ్యూయల్ సర్‌ఛార్జ్ కూడా విధిస్తారు. ఫ్యూయల్ స్టేషన్లు కార్డ్ స్కిమ్మింగ్‌కు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. లోపభూయిష్టమైన పేమెంట్ మెషీన్ల ద్వారా కార్డ్ వివరాలు దొంగిలించవచ్చు. ఫ్యూయల్ చెల్లింపుల కోసం యూపీఐ లేదా డెబిట్ కార్డును ఉపయోగించడం ద్వారా అదనపు ఛార్జీలను నివారించవచ్చు. ఇక క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం ద్వారా నగదు తీసుకోకూడదు. బ్యాంకులు ఇలాంటి ట్రాన్సాక్షన్లపై 2.5% నుండి 3% వరకు క్యాష్ అడ్వాన్స్ ఫీజును వసూలు చేస్తాయి. అంటే వడ్డీ లావాదేవీ జరిగిన తేదీ నుండే ప్రారంభమవుతుంది. దీని వల్ల ఎక్కువ వడ్డి పడుతుంది.

ఈఎంఐ పెట్టుకుంటున్నారా..?

ఇక కొన్ని రైల్వే టిక్కెట్ల బుకింగ్‌లు, డిజిటల్ వాలెట్ లోడింగ్ వంటి కొన్ని ఆన్‌లైన్ లావాదేవీలను క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించకండి. అదనపు పేమెంట్ గేట్‌వే ఛార్జీలు, సౌకర్య రుసుములు లేదా జీఎస్టీ వర్తించవచ్చు. చెల్లింపు చేసే ముందు అదనపు ఛార్జీలు వర్తిస్తాయో లేదో చెక్ చేస్కోండి. ఇక మీరు ఇప్పటికే పెద్ద మొత్తంలో రుణం లేదా అనేక EMIలు తిరిగి చెల్లిస్తున్నట్లయితే, క్రెడిట్ కార్డ్ ద్వారా మరింత ఖర్చు చేయకండి. దీన వల్ల మీ ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితులలో డెబిట్ కార్డ్ లేదా UPIని ఉపయోగించడం వల్ల మీ ఖర్చులను మీ బ్యాంక్ ఖాతాలో అందుబాటులో ఉన్న డబ్బు పరిధిలోనే ఉంచుకోవచ్చు. దీని వల్ల మీకు అప్పుల భారం తగ్గుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us