Coca Cola: కొత్త మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న కోకాకోలా.. కూల్‌డ్రింక్‌ బ్రాండ్‌ నుంచి ఇకపై..

|

Nov 23, 2023 | 9:43 AM

హానెస్ట్‌ టీ పేరుతో ప్రొడక్ట్స్‌ను తీసుకురానున్నట్లు కోకాకోలా ఇండియా తాజాగా వెల్లడించింది. కోకాకాలో అనుబంధ సంస్థ హానెస్ట్‌ మార్కెట్‌లోకి ఈ టీని తీసుకురానుంది. ఇందులో భాగంగా కోల్‌కతాకు చెందిన లక్ష్మీ టీ కో ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన మకైబారి టీ ఎస్టేట్‌తో ఒప్పందం చేసుకుంది. కోకాకోలా కంపెనీ ఆర్గానిక్ గ్రీన్ టీని తీసుకురానున్నట్లు కోకాకోలా ప్రతినిధులు తెలిపారు. కోల్‌కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్...

Coca Cola: కొత్త మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న కోకాకోలా.. కూల్‌డ్రింక్‌ బ్రాండ్‌ నుంచి ఇకపై..
Cocacola
Follow us on

కోకాకోలా అనగానే ముందుగా గుర్తొచ్చేది కూల్‌ డ్రింక్‌. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ బ్రాండ్‌ నుంచి ఎన్నో రకాల పేర్లతో కూల్‌ డ్రింక్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అయితే కూల్‌ డ్రింక్స్‌కు పెట్టింది పేరైన కోకాకోలా ఇప్పుడు కొత్త తయారీ రంగంలోకి ప్రవేశిస్తోంది. కోకాకోలా నుంచి ఇకపై టీ ప్రొడక్ట్స్‌ రానున్నాయి.

హానెస్ట్‌ టీ పేరుతో ప్రొడక్ట్స్‌ను తీసుకురానున్నట్లు కోకాకోలా ఇండియా తాజాగా వెల్లడించింది. కోకాకాలో అనుబంధ సంస్థ హానెస్ట్‌ మార్కెట్‌లోకి ఈ టీని తీసుకురానుంది. ఇందులో భాగంగా కోల్‌కతాకు చెందిన లక్ష్మీ టీ కో ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన మకైబారి టీ ఎస్టేట్‌తో ఒప్పందం చేసుకుంది. కోకాకోలా కంపెనీ ఆర్గానిక్ గ్రీన్ టీని తీసుకురానున్నట్లు కోకాకోలా ప్రతినిధులు తెలిపారు. కోల్‌కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ఏడవ ఎడిషన్‌లో రెండు కంపెనీల మధ్య ఒప్పందం జరిగింది.

కస్టమర్లకు టీ పానీయాన్ని అందించడమే ఈ ఆలోచనల వెనకాల ఉన్న అసలు ఉద్దేశమని కోకా-కోలా ఇండియా, సౌత్‌వెస్ట్ ఆసియా సీనియర్‌ అధికారి తెలిపారు. కోకాకోలా ఈ టీని ఐస్‌డ్ గ్రీన్ టీ లెమన్-తులసి, మ్యాంగో వేరియంట్స్‌లో తీసుకురానున్నారు. సేంద్రీయ గ్రీన్ టీతో తయారు చేసిన ఐస్‌డ్ గ్రీన్ టీ ప్రత్యేకంగా లక్ష్మీ గ్రూప్ మకైబారి ఎస్టేట్ నుంచి సేకరించారు.

ఈ విషయమై కోకా కోలా ఇండియా, సౌత్‌వెస్ట్ ఆసియా మార్కెటింగ్ – హైడ్రేషన్, కాఫీ, టీ కేటగిరీ డైరెక్టర్ కార్తీక్ సుబ్రమణియన్ మాట్లాడుతూ.. ‘ఈ రెడీ-టు డ్రింక్ ఐస్‌డ్ గ్రీన్ టీని పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. హానెస్ట్ టీతో, మేం వినియోగదారులకు అద్భుతమైన గ్రీన్ టీ ఆధారిత పానీయాన్ని అందిస్తున్నాం’అని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ గ్రీన్‌టీ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..