Cooking Oil: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!

Cooking Oil: గృహాల్లో వంట నూనె వాడకం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు శుభవార్త అందించింది. పెరుగుతున్న ధరల మధ్య ఉపశమనం కలిగించే ప్రయత్నంలో భాగంగా ధరల నుంచి ఉపశమనం కలిగించనుంది. అయితే దీనిపై ఇప్పటికే అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం..

Cooking Oil: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
Cooking Oil

Updated on: Feb 23, 2026 | 12:29 PM

Cooking Oil: వంటనూనె.. ప్రతి ఇంట్లో ఇది ముఖ్యమైనదే. అయితే ప్రస్తుతం వంట నూనెల 150 రూపాయలకుపైనే ఉంది. సామాన్యులకు ఈ ధర కాస్త ఎక్కువ. గత కొన్ని రోజులుగా కాస్త అటు ఇటుగా ఇదే ధరతో కొనసాగుతోంది. ఈ నేపత్యంలో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. నిత్యం పెరిగే ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఊరటనిచ్చేలా చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముడి వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు మే 31వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను కేంద్రం ఇప్పటికే విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో వంట నూనె రేట్లు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

అయితే ఇప్పుడున్న నియమ నిబంధనల ప్రకారం.. ముడి పామాయిల్, ముడి సోయాబీన్ ఆయిల్ తో పాటు ముడి పొద్దుతిరుగుడు నూనెలపై 20 శాతం దిగుమతి పన్ను విధిస్తోంది. ఇప్పుడు ఈ పన్నును సగానికి కుదించి 10 శాతానికి పరిమితం చేశారు. భారతదేశం తన వంట నూనె అవసరాల కోసం 70 శాతం వరకు ఇతర దేశాల పైనే ఆధారపడుతోంది. మన దేశంలో నూనె గింజల ఉత్పత్తి తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణమనే చెప్పాలి. విదేశాల నుండి వచ్చే ముడి చమురుపై పన్ను తగ్గడం వల్ల స్థానిక మార్కెట్‌లో ధరలు దిగివస్తాయి.

ఇది కూడా చదవండి: Air Conditioner: మిత్రమా.. సమ్మర్‌ వచ్చేస్తోంది.. ఏసీ స్కామ్‌ గురించి మీకు తెలుసా?

పామాయిల్‌ దిగుమతి:

కాగా, ఇక పామాయిల్‌ను ఇండోనేషియా, థాయిలాండ్‌, మలేషియా వంటి దేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటోంది. అలాగే సన్‌ఫ్లవర్ నూనె ఉక్రెయిన్‌, రష్యా, అర్జెంటీనా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి వస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గిస్తే ఈ నూనెలపై మొత్తం పన్ను భారం 27.5 శాతం నుండి 16.5 శాతానికి తగ్గుతుంది. దీంతో ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు వరుస సెలవులు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us