LPG Cylinder Price: సామాన్యుడికి బిగ్‌ షాక్‌.. వంట గ్యాస్‌ ధర పెంపు!

కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను రూ.50 పెంచింది. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై ఈ పెంపు మరింత భారం మోపుతుంది. ఉజ్వల పథకం కింద వచ్చే సిలిండర్ల ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ఈ పెరుగుదల పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రేపటి నుండి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.

LPG Cylinder Price: సామాన్యుడికి బిగ్‌ షాక్‌.. వంట గ్యాస్‌ ధర పెంపు!
Gas Cylinder Price Hike

Updated on: Apr 07, 2025 | 5:08 PM

ఇప్పటికే నిత్య అవసరం ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై మరోసారి భారం మోపింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా వంట గ్యాస్‌ ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. సిలిండర్‌పై రూ.50 పెంచినట్లు కేంద్ర చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ఈ పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడనుంది. ఇది ఉజ్వల పథకం సిలిండర్లకు కూడా వర్తిస్తుంది. ఈ ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి.

ధరల పెరుగుదల గురించి కేంద్ర పెట్రోలియం మంత్రి మాట్లాడుతూ.. 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 500 నుంచి రూ. 550కు పెరిగింది. ఈ ధర ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తిస్తుంది. ఇతరులు రూ. 853 చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు వినియోగదారులపై భారం మోపడం లేదని కూడా స్పష్టం చేశారు. సబ్సిడీ గ్యాస్ ధరల కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొన్న 43,000 కోట్ల నష్టాన్ని భర్తీ చేయడానికి ఇది సహాయపడుతుందని మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..