
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మహిళా సమృద్ది యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా గ్రామీణ, వెనుకబడిన వర్గాల్లోని మహిళలకు ఆర్ధిక సాయం అందిస్తోంది. నైపణ్య శిక్షణ అందించడంతో పాటు వ్యాపారులు ప్రారంభించుకుని స్వయం ఉపాధి పొందేందుకు రుణాలు అందిస్తోంది. ఈ రుణాలకు వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు రూ.1.4 లక్షల వరకు మహిళలు ఈ పథకం ద్వారా రుణం పొందోచ్చు. మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు, వాళ్లు తమ సొంత కాళ్ల మీద నిలబడేలా ఆర్ధికంగా తోడ్పాటు అందించేందుకు కేంద్రం సహాయపడుతుంది. వ్యాపారులు స్టార్ట్ చేయాలనుకునే మహిళలు తమ కలలను సాకారం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలవనుంది.
ఈ పధకం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ టైమ్‌లో మహిళలకు స్ట్రైఫండ్ కూడా అందిస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మహిళలకు మైక్రో క్రెడిట్ కంటే తక్కువ రేటుకు రుణం అందిస్తారు. దీని ద్వారా శిక్షణ పూర్తయిన తర్వాత మహిళలు సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల మహిళల కోసం ఈ పథకం ప్రారంభించారు.
-వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి
-రూ.1.40 లక్షల వరకు రుణం
-3 లేదా 5 సంవత్సరాల్లో రుణం తిరిగి చెల్లించాలి
-ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలు అర్హులు
-వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువగా ఉండాలి
-NSFDC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
-దరఖాస్తు ఫారంను డౌన్‌లోడ్ చేసుకోండి
-మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయండి
-అన్ని పత్రాలను అప్ లోడ్ చేయండి
-దరఖాస్తును పూర్తి చేశాక రాష్ట్ర చానలైజింగ్ ఏజెన్సీ ఆఫీసులో అందించండి.
-ఆ తర్వాత అనుమతి వచ్చాక మహిళలు ఏదైనా బ్యాంకు ద్వారా అపలై చేసుకోవాల్సి ఉంటుంది.
-ఆ తర్వాత నేరుగా రుణం మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు