LPG Gas Price: ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన సిలిండర్‌ ధర

LPG Gas Price: చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్‌ సిలిండర్ వినియోగదారులకు శుభవార్తను అందించాయి. సెప్టెంబర్‌ 1వ తేదీన గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ తగ్గించిన ధర సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. మరి గ్యాస్‌ సిలిండర్‌పై ఎంత తగ్గిందో చూద్దాం..

LPG Gas Price: ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన సిలిండర్‌ ధర

Updated on: Sep 01, 2025 | 6:22 AM

LPG Gas Cylinder Price: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు గుడ్‌న్యూస్‌. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన గ్యాస్‌ సిలిండర్ల ధరలలో మార్పులు ఉంటాయి. అలాగే ఈ సెప్టెంబర్‌ 1న దేశంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గుముఖం పట్టింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి. ఈసారి ధరలు రూ.51 తగ్గాయి. అయితే, ఈ తగ్గింపు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్లలో మాత్రమే. ఈ ధర మార్పు తర్వాత ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర రూ.1580. ఇప్పటివరకు ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1631.50గా ఉండేది. కొత్త ధరలు ఈరోజు అంటే సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను మార్చాయి. ఇక 4.2 కిలోల గృహ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు.

ఇది కూడా చదవండి: Indian Railways: ఇది భారతదేశంలో అత్యంత చౌకైన సూపర్‌ఫాస్ట్ రైలు.. AC ప్రయాణానికి కేవలం 68 పైసలే!

ఈ సంవత్సరం ధరలు నిరంతరం తగ్గాయి:

మార్చి నెల మినహా 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు జనవరి 1, 2025 నుండి నిరంతరం తగ్గుతున్నాయి. జనవరి 1న దీనిని రూ.14.50 తగ్గించారు. దీని తర్వాత ఫిబ్రవరిలో రూ.7 తగ్గింది.

మార్చిలో ధరలు పెరిగాయి:

అయితే మార్చి 1న ధరలను కూడా రూ.6 పెంచారు. ఆ తర్వాత, ఏప్రిల్ 1న, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను రూ.41 తగ్గించారు. దీని తర్వాత మే 1న రూ.14, జూన్ 1న రూ.24 చొప్పున తగ్గించారు. జూలై 1న, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.58.50 చొప్పున తగ్గించారు. దీని తర్వాత ఆగస్టు 1న మళ్లీ రూ.33.50 చొప్పున తగ్గించారు. ఇప్పుడు మరోసారి ధరలు తగ్గించారు. ఇక హైదరాబాద్‌లో రూ.50.50పైసలు తగ్గింది. ప్రస్తుతం19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.1801 ఉంది. అదే 14.2 కిలోల గృహ LPG సిలిండర్: రూ.905.00 ఉంది.

ఇది కూడా చదవండి: BSNL: ఆశ్చర్యపరిచే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌.. రూ.151తో 30 రోజుల వ్యాలిడిటీ.. 40GB డేటా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి